- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వావ్.. వాట్ యాన్ ఐడియా: ట్రాక్టర్‌ని బుల్లెట్ ప్రూఫ్‌గా మార్చిన రైతు
దిశ,వెబ్ డెస్క్: ఇప్పటివరకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాల గురుంచి విన్నాం. బుల్లెట్ జాకెట్ ల గురించి విన్నాం. కానీ ఎప్పుడైనా బుల్లెట్ ప్రూఫ్ ట్రాక్టర్ గురుంచి విన్నారా ? అదికూడా ఒక సామాన్య రైతు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి సరికొత్త వాహనానికి నాంది పలికాడు. ఈ కష్టం వెనక చాలా పెద్ద కారణమే ఉంది. అదే ఆత్మ రక్షణ. పొరుగు రాష్ట్రాల రైతులు చేసే దాడుల నుండి తనను తానూ రక్షించుకోవడానికి రాజేంద్ర అనే రైతు తన ట్రాక్టర్ ని బుల్లెట్ ప్రూఫ్ గా మార్చాడు.
హర్యానా, ఉత్తరప్రదేశ్ సరిహద్దులో ఎన్నో ఏళ్లుగా జల వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే .ఈ వివాదంలో ఎంతోమంది మరణించారు.ఇప్పటికీ ఆ వివాదం రేగినప్పుడల్లా ఇరు రాష్ట్రాల మధ్య దాడులు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలోనే రాజేంద్రపై పొరుగు రాష్ట్ర రైతులు దాడికి పాల్పడ్డారు. దీంతో దాడినుండి తనను తానూ రక్షించుకోవడానికి రైతు విన్నూతంగా అలోచించి తన ట్రాక్టర్ ని బుల్లెట్ ప్రూఫ్ గా మార్చేశాడు. దీనికోసం రూ. 5 లక్షలు వెచ్చించాడు. ఈ ట్రాక్టర్ లోపల సీసీటీవీ కెమెరా, ఏసీ, జీపీఎస్ ట్రాకర్ లాంప్ ఆధునిక టెక్నాలజీ ని మొత్తం ఫిక్స్ చేసాడు. ప్రస్తుతం ఈ బుల్లెట్ ప్రూఫ్ ట్రాక్టర్ స్థానికంగా సంచలనం సృష్టిస్తుంది. అయితే ఈ బుల్లెట్ ప్రూఫ్ ట్రాక్టర్ ఐడియా బానే ఉన్నా .. ఇది కేవలం పెద్దకారు రైతులకు ఐతే సరిపోతుంది కానీ చిన్న , సన్నకారు రైతులు ఇంత పెద్ద మొత్తం భరించలేరేమో.