- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ ఫ్రాంచైజీ ఓనర్ ఐపీఎల్ ఆడతాడంటా..!
దిశ, స్పోర్ట్స్ : ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయాంక గురించి క్రికెట్ ప్రేమికులకు తెలిసిందే. ఆర్పీజీ గ్రూప్ యజమాని అయిన సంజీవ్ గోయాంకకు గతంలో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ అనే ఫ్రాంచైజీ ఉండేది. ఆయన సోదరుడే హర్ష్ గోయాంక. గతంలో రెండేళ్ల పాటు ఆర్పీఎస్ ఫ్రాంచైజీని నిర్వహించిన సమయంలో రోజుకో వివాదాద్సద వ్యాఖ్య చేస్తూ వార్తల్లో ఉండేవాడు. ముఖ్యంగా ధోనీపై అనేక అనుచిత వ్యాఖ్యలు చేసేవాడు. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌లో రెండు కొత్త ఫ్రాంచైజీలు తీసుకొని రాబోతున్నట్లు బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. వాటిలో ఫ్రాంచైజీని దక్కించుకోవాలని గోయాంక ఆరాటపడుతున్నాడు. అయితే తాజాగా హర్ష్ ట్విట్టర్‌లో సరదాగా చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘కొత్త జీవితానికి ధన్యవాదాలు. నేను ప్రతీరోజు సాయంత్రం క్రికెట్ ఆడుతున్నాను. ఫైనల్‌గా ఫామ్‌లోకి వచ్చాను. ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానులకు నేను అందుబాటులో ఉన్నానని చెబుతున్నాను. నేను ఉచితంగానే క్రికెట్ ఆడతాను. అయితే రెండు కండిషన్లు. మ్యాచ్‌లు టెన్నిస్ బాల్‌తో ఆడాలి. రెండోది 50 పరుగులు పూర్తి చేశాక నాకు ఒక రన్నర్‌ని ఇవ్వాలి’ అని ట్విట్టర్‌లో పోస్టు పెట్టాడు.