- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హరితహారమా..? సీఎం పర్యటననా?.. ఎందుకీ హడావుడి..!
దిశ, నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని ఉన్న సమీకృత కలెక్టరేట్ నూతన భవన్ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ వస్తున్నట్లు గతంలో వినికిడి వినిపించినా ప్రస్తుతం మాత్రం హరితహారంలో భాగంగా జాతీయ రహదారి44 నెంబర్ రోడ్డుపై ఇరువైపుల చెట్లను నాటి అధికారులు యుద్ధ ప్రాతిపతికన రోడ్లను శుభ్రం చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా ఆరంభం నుండి చంద్రాయన్‌పల్లి శివారు నుండి జిల్లా కేంద్రం సమీకృత కలెక్టరేట్ నూతన భవనం వరకు పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు అధికారులు రాత్రీపగలనకా కష్టపడుతున్నారు.
ఇందులో భాగంగా 44 నెంబర్ జాతీయ రహదారి, 63నెంబర్ జాతీయ రహదారికి ఇరువైపులా మధ్యలో ఉన్న డివైడర్ల లో ఉపాధిహామీ కూలీలు గత పదిహేను రోజుల నుండి గుంతల తవ్వుతూ మొక్కలు నాటుతారు. గత పదిహేను రోజుల నుండి రోజు ఉన్నతాధికారులు పర్యవేక్షణలో ఉపాధి హామీ కూలీలకు క్షణం తీరిక లేకుండా సాయంత్రం వరకు రోడ్ల పరిశుభ్రతలో నిమగ్నమయ్యారు. అసలు సీఎం కేసీఆర్ సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవానికి వస్తారా..? లేదంటే హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటుతున్నారా..? అనే విషయం ప్రజల అనుమానానికి తావిస్తోంది.
సీఎం కేసీఆర్ వస్తేనే రోడ్లు శుభ్రపరుస్తారా? లేదంటే శుభ్రపరిచారా? హరితహారం కార్యక్రమం ప్రస్తుతం వర్షాకాలం సీజన్ లోనే చేపడతారు కదా అని ప్రజలు గుసగుసలాడు కుంటున్నారు. నిజామాబాద్ జిల్లా ప్రజలు కామారెడ్డి వరకు వచ్చిన సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లాలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించాలి కదా? అని ప్రజలు ఆరోపిస్తున్నారు. మరోవైపు గత 20 రోజుల క్రితం సీఎం కేసీఆర్ నిజామాబాద్ నుండి కరీంనగర్ జిల్లాకు వెళ్తుండగా మధ్యలో రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటి వద్ద కొద్ది సేపు ఆగి ప్రశాంత్‌రెడ్డి తండ్రి వేముల సురేందర్రెడ్డికి నివాళులర్పించారు.
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లా ప్రారంభం నుండి హరితహారం నాటిన మొక్కలు ఎక్కువ లేనందున, జాతీయ రహదారికి ఇరువైపులా ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించనందున మంత్రి వేముల పై జిల్లాపై కొంత అసంతృప్తితో ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ వారం రోజుల్లో సీఎం కేసీఆర్ సమీకృత భవనాన్ని ప్రారంభిస్తారా లేదా హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నారని విషయం తేటతెల్లమవుతోంది.