- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతుల ధాన్యం మొత్తాన్ని కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ: హరీష్
దిశ సిద్దిపేట: రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వ కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. ఇప్పటికే సిద్దిపేట జిల్లాలో 85 శాతంపైగా ధాన్యంను రైతుల నుంచి కొనుగోలు చేశామన్నారు. వర్షాకాలం సీజన్ ప్రారంభమైన దృష్ట్యా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా మిగతా పదిహేను శాతం ధాన్యాన్ని సాధ్యమైనంత తొందరగా కొనుగోలు చేసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. మంగళవారం ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కలెక్టరేట్ మీటింట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… జిల్లాలో గన్ని బ్యాగ్ ల కొరతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని మంత్రి తెలిపారు. రేపటిలోగా 7 లక్షల గన్ని బ్యాగ్ లను జిల్లాకు ఇచ్చేందుకు అధికారులు సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిపారు. రేపు గన్ని బ్యాగ్ లు జిల్లాకు రాగానే జిల్లాలో అవసరం ఉన్న అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించి అందుబాటులో ఉంచుతామన్నారు. ఇప్పటికే జిల్లాలో ధాన్యం తరలించేందుకు లారీలు, ఇతర వాహనాల కొరత ఉండగా.. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని ప్రైవేటు వాహనాలను స్వాధీనం చేసుకుని ధాన్యాన్ని తరలించడం జరిగింది అన్నారు.అయినప్పటికీ ఇంకా పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తూకం వేసిన ధాన్యం పేరుకుపోయిన పరిస్థితులు ఉన్నాయన్నారు.
ఈ ధాన్యాన్ని వెంటనే లిఫ్ట్ చేసేందుకు వీలుగా జిల్లా పరిధిలో నుండి వెళ్లే ఇసుక లారీలను రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా స్వాధీనం చేసుకొని వాటిని ధాన్యం లిఫ్ట్ చేసేందుకు ఉపయోగించుకోవాలి అన్నారు.
దాంతో పాటు రైతు బంధు సమితి అధ్యక్షులు, సభ్యులు, AMC చైర్మన్ లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు రైతులతో మాట్లాడి స్థానికంగా అందుబాటులో ఉన్న ట్రాక్టర్ ల ద్వారా రైతులు తూకం వేసిన ధాన్యంను రైస్ మిల్లుల వద్దకు తరలించేందుకు వీలుగా వారిని ప్రోత్సాహించాలన్నారు. హుస్నాబాద్ డివిజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే చాలా వరకు క్లోజ్ చేసినందున అక్కడ ఉన్న హమాలీలను సిద్దిపేట ,దుబ్బాక , గజ్వేల్ నియోజకవర్గాల పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని లోడింగ్, అన్ లోడ్ చేసేందుకు ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు. వచ్చే మూడు రోజులకు ధాన్యం సేకరణకు అత్యంత కీలక మని క్షేత్రస్థాయిలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ రైతు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. సిద్దిపేట జిల్లా ట్యాబ్ ఎంట్రీ లో పాటు రైతులకు డబ్బులు చెల్లింపుల్లో తెలంగాణలోనే ప్రథమ స్థానంలో ఉన్నదని అదే స్ఫూర్తితో పంట మొత్తం కొనుగోలు చేసేవరకు అధికారులు అంకితభావంతో పని చేసి ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.