- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘పవన్‌పై ఎందుకు ఇన్ని రుమార్లు?’
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా గబ్బర్ సింగ్. ‘రాసుకోరా సాంబా’ అంటూ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఈ మూవీ పవన్ స్టామినాను మరోసారి రుజువు చేసింది. పోలీస్ ఆఫీసర్‌గా పవన్‌ను పవర్‌ఫుల్‌గా చూపించిన డైరెక్టర్ ఆ ఖాకీ డ్రెస్‌కు కాస్త కామెడీ ఎలిమెంట్ జోడించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. 2012లో వచ్చిన ఈ సినిమా పవన్‌లోని కామెడీ యాంగిల్‌ను ఫుల్‌గా చూపించేసింది.
అయితే పవన్‌తో హరీశ్‌శంకర్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోందనే గుడ్ న్యూస్ తో పవర్‌స్టార్ ఫ్యాన్స్ దేఖో దేఖో గబ్బర్‌సింగ్ సాంగ్‌పై ఆనందంలో డ్యాన్స్ వేసేశారు. అయితే మీడియాలో ఈ సినిమా విషయంలో రుమార్లు హల్‌చల్ చేస్తున్నాయి. తమిళ్ మూవీస్ ‘తేరి’ , ‘వేదాళం’ లలో ఏదో ఒక చిత్రాన్ని రీమేక్ చేయనున్నారని వార్తలు వచ్చాయ్. ఈ న్యూస్ పై స్పందించాడు డైరెక్టర్ హరీష్. దయచేసి ప్రేక్షకులను తప్పుదోవ పట్టించొద్దని తెలిపాడు. మీడియా మిత్రులకు ఫోన్‌కాల్ దూరంలో ఉన్నానని, సినిమా గురించి ఎలాంటి సమాచారం కావాల్సిన అడగొచ్చని సూచించాడు. అంతేకాని తప్పుడు ప్రచారాలు చేయొద్దని కోరాడు హరీశ్ శంకర్.