- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో హరీశ్‌రావు టెలీకాన్ఫరెన్స్
by Shyam |
దిశ, మెదక్: సిద్దిపేట జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్ రావు బుధవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంగళవారం కురిసిన అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యం గురించి ఆయన ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే కొనుగోళ్లు, ఉపాధిహామీ పనులు పెంచేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని మంత్రి సూచించారు. తడిసిన ధాన్యం కారణంగా రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అడిషనల్ కలెక్టర్ పద్మాకర్‌ను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు 83,640 క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లు చేశామని మంత్రి గుర్తు చేశారు. వీటికి సంబంధించి రూ. 53.20 కోట్ల వరకు రైతులకు చెల్లింపులు చేశామన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోళ్ల కేంద్రాలకు ఆరబెట్టి తెచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి హరీశ్ రావు అధికారులకు సూచనలు చేశారు.
Tags: Harish Rao, teleconference, MLA, officials, siddipet
Advertisement
Next Story