హరీశ్ రావుకు తలపాగా కట్టి..

by Shyam |
హరీశ్ రావుకు తలపాగా కట్టి..
X

దిశ, మెదక్: సీఏం కేసీఆర్‌ గొర్రెల పంపిణీ చేపట్టి గొల్ల కుర్మల కుటుంబాల్లో వెలుగులు నింపారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. సిద్ధిపేట జిల్లా ఇర్కోడ్ గ్రామ శివారులో ఆదివారం ఉదయం 9 సామూహిక గొర్రెల షెడ్లను జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ గొల్ల కుర్మల జీవనోపాధికి, ఆర్థికంగా అభివృద్ధి చేందేందుకు గొర్రెల పంపిణీ చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. గొర్రెలకు మంచి వసతి ఉండే విధంగా సామూహిక గొర్రెల షెడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. సిద్ధిపేట నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో గొర్రెల షెడ్లు నిర్మించామని, గొర్రెలను ఎవరూ అమ్ముకోవద్దని యాదవులకు మంత్రి సూచించారు. నియోజకవర్గ గొల్ల కుర్మలకు అండగా ఉంటామన్నారు. ఈ మేరకు మంత్రికి తలపాగా కట్టి, శాలువతో ఆత్మీయంగా గొల్ల కుర్మలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed