హ్యాపీ బర్త్ డే 'రోజా'

by Shyam |   ( Updated:2020-11-17 00:24:12.0  )
హ్యాపీ బర్త్ డే రోజా
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ రోజా పేరు వినగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది జబర్ధస్త్ షో. తన అందంతో పాటు, ఆకర్షణీయమైన నవ్వుతో ఆ షోలో ఎప్పుడూ ఆకర్షణగా నిలుస్తారు. రాజకీయంగా బిజీగా ఉంటూనే మరొపక్క, ఈవెంట్‌లు, షోలు చేస్తూ… అందరినీ అలరిస్తున్నారు. రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన ‘ప్రేమ తపస్సు’ చిత్రంలో నటిగా రోజా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది. నాటి నుంచి రోజా తన సినీ జీవితంలో ఎన్నో సినిమాల్లో కథనాయికగా నటించింది. ఏ చిత్రంలో నటించినా.. తనదైన శైలిలో మెప్పించడం రోజా ప్రత్యేకత. సీతారత్నం గారి అబ్బాయి, ముఠామేస్త్రీ సినిమాల్లో రోజా నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

నటిగా తన సినీ ప్రస్థానంతో ఎన్నో విజయాలు సాధించారు. అనంతరం నాటి తమిళ స్టార్ డైరెక్టర్ సెల్వమణితో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం చిన్న చిన్న వేశాలు, గోలిమార్ చిత్రంలో హీరోయిన్‌కు తల్లిగా నటించారు. అంతేగాకుండా బుల్లితెరలో సూపర్ హిట్ అయిన జబర్ధస్త్‌ షో కు జడ్జిగా వ్యవహరిస్తూ అద్భుతంగా రాణిస్తున్నారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంటూనే.. ఇండస్ట్రీలో ఏమాత్రం తగ్గకుండా అవసరమున్న చోటల్లా తనవంతు కృషి చేస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి తర్వాత అనేక లేడీ ఓరియంటెడ్ పాత్రలతో రోజా కూడా అలరించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నగరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆమె రాజకీయాల్లో బీజిగా అయిపోయారు. కాగా నేడు(మంగళవారం) ఆమె పుట్టిన రోజు కావడంతో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed