హ్యాపీ బర్త్ డే కరోనా

by Anukaran |
హ్యాపీ బర్త్ డే కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి, ఈ పేరు వింటే ప్రపంచ దేశాల్లో వణుకుపడుతుంది. సరిగ్గా ఇదే రోజున ఏడాది క్రితం చైనాలోని హుబెయ్ ప్రావిన్సులో 55 ఏళ్ల వ్యక్తిలో కరోనా తొలి కేసు నమోదు అయింది. ఈ విషయాన్ని చైనా మంగళవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. వైరస్ పుట్టిన నాటి నుంచి విస్తృతంగా వ్యాప్తిచెందుతూ… ప్రపంచ దేశాలకు పాకింది. దీంతో ఒక్కొక్కటిగా దేశదేశాలు లాక్‌డౌన్‌ వంటి అనేక ఆంక్షలు విధించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. లక్షలమంది జీవితాలను కరోనా చిన్నాభిన్నం కాగా.. అన్ని దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

అంతేగాకుండా అగ్రరాజ్యాధినేతలతో పాటు ప్రముఖులకు సైతం మహమ్మారి సోకి ముచ్చెమటలు పట్టించింది. అయితే తొలిదశలోనే చైనా కరోనాను గుర్తించి, నివారణ చర్యలు తీసుకుంటే దాని ప్రభావం ఇతర దేశాలపై పడి ఉండేది కాదని పలువురు భావిస్తున్నారు. అంతేగాకుండా చైనా కావాలనే వైరస్‌ను ఇతర దేశాలకు వైరస్ సోకేలా చేసిందన్న ఆరోపణలూ ఉన్నాయి. అయితే కరోనా వైరస్ పుట్టి ఏడాది అవుతున్న సందర్భంగా ‘గో కరోనా’ అంటూ సోషల్ మీడియాలో పలువురు పోస్లులు పెడుతున్నారు.

కాగా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 55,389,375మందికి కరోనా వైరస్ సోకింది. వీరిలో 38,529,424 మంది కరోనా నుంచి కోలుకోగా.. 1,333,019 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 15,526,932 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఏడాది అవుతున్నా ఈ వైరస్‌కి వ్యాక్సిన్‌పై క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగుతున్నాయి. అంతేగాకుండా భారత్‌లో ఇప్పటివరకు 8,874,290 మందికి వైరస్ సోకింది. దేశవ్యాప్తంగా 1,30,519 మందిని బలిగొంది. తెలంగాణలో 2,58,828 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వైరస్ బారినపడి 1,410 మంది మృత్యువాతపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed