ఘనంగా ఆలయ నిర్మాణ శంకుస్థాపన.. వెల్లువెత్తిన విరాళాలు..

by Shyam |
ఘనంగా ఆలయ నిర్మాణ శంకుస్థాపన.. వెల్లువెత్తిన విరాళాలు..
X

దిశ, పెన్ పహడ్; మండల పరిధిలోని చీదేళ్ళ గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థాన నూతన ఆలయ నిర్మాణ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రామాలయ దేవస్థాన ఆలయ నిర్మాణ కొరకు 15,10,116/-రూపాయలు విరాళంగా ఇచ్చి నలబోలు వెంకటరెడ్డి, సుజాతమ్మలు తమ ఔన్నత్యాని చాటుకున్నారు. దంపతులకు గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చీదేళ్ళ గ్రామ పంచాయతీ సర్పంచ్ పరెడ్డి సీతారాంరెడ్డి పాల్గొని మాట్లాడారు. ఆలయ అభివృద్ధికి తాను కూడా కృషి చేస్థానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో నలబోలు వెంకటరెడ్డి, సుజాతమ్మ దంపతులు, చీదేళ్ళ MPTC జూలకంటి వెంకటరెడ్డి, చీదేళ్ళ PACS చైర్మన్ వెన్న సీతారాంరెడ్డి, చీదేళ్ళ దేవాలయ కమిటీ చైర్మన్ & పెన్ పహాడ్ మండల TRS పార్టీ రైతు విభాగం అధ్యక్షులు గుర్రం అమృతా రెడ్డి, పోతుగంటి మల్లికార్జున, ఉప సర్పంచ్ బిజిగ గోపయ్య, నలబోలు లింగారెడ్డి, TRS చీదేళ్ళ గ్రామ శాఖ అధ్యక్షులు కీర్తి వెంకట్ రావు గౌడ్, రైతు సమన్వయ సమితి కొ-ఆర్డినేటర్ వెన్న గోపి రెడ్డి, మైనంపాటి వెంకట్ రెడ్డి, నలబోలు ప్రభాకర్ రెడ్డి, పరెడ్డి వీరారెడ్డి శోభ దంపతులు (గౌట్ టీచర్ లు), సూర్యపేట జిల్లా కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్షులు మడ్డి అంజిబాబు గౌడ్, పందుల నాగరాజు గౌడ్(TRS పార్టీ సోషల్ మీడియా), మర్రిపెల్లి సంతోష్ (10వ వార్డు సభ్యులు), చేర్యాల శంకరాచారి, దేశగాని సతీష్ గౌడ్ (2 వార్డు సభ్యులు), చినపంగి తిరపయ్య (ఎల్పర్), గొబ్బి రమేష్, చీదేళ్ళ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

Next Story