మునుగోడులో నేతన్నల ఆందోళన

by Shyam |
మునుగోడులో నేతన్నల ఆందోళన
X

దిశ, మునుగోడు: చేనేత కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ యాదాద్రి-భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని పద్మశాలి కార్మిక సంఘ భవనంలో గత 11 రోజులుగా రిలే నిరాహార దీక్షలను కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం దీక్షా శిబిరంలో మహిళా కార్మికులు పాల్గొన్నారు. అనంతరం చేనేత కార్మికులు నారాయణపురం మెయిన్ రోడ్ పై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా చేనేత కార్మికులు మాట్లాడుతూ… నిల్వ ఉన్న చేనేత వస్త్రాలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, చేనేతకు చేయూత పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని ఆరోపించారు. చేనేత కార్మికులు కరోనా మహమ్మారితో ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని, ప్రతి కుటుంబానికి నెలకు 15 వేల రూపాయల జీవనభృతిని అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కార్మిక సంఘం అధ్యక్షులు సూరేపల్లి భాస్కర్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి రహీం షరీఫ్, కాంగ్రెస్ నాయకులు మందుగుల బాలకృష్ణ, మహిళా కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed