కరోనాకు గొడుగుతో అడ్డుకట్ట వేస్తున్న.. హెయిర్ స్టైలిష్ట్

by Shyam |
కరోనాకు గొడుగుతో అడ్డుకట్ట వేస్తున్న.. హెయిర్ స్టైలిష్ట్
X

దిశ వెబ్ డెస్క్: ప్రపంచమంతా కరోనా భయంతో బిక్కుబిక్కుమంటోంది. ప్రపంచ ప్రజలంతా.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా బాధితుల సంఖ్య ప్రజలను మరింత కలవరపెడుతోంది. ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడంతో చాలామంది ఇళ్లకే పరిమితం అవుతున్నారు. బయట తిరిగే సాహసం చేయడం లేదు. కొన్ని దేశాల్లో ఏకంగా జైలు శిక్షలు, భారీ జరిమానాలు విధిస్తున్నారు. దీంతో ప్రజలకు ఇల్లే లోకమయ్యింది. ఇంతమంది ఇంతగా బయపడుతున్న వేళ… ఓ హెయిర్ స్టైలిస్ట్ గొడుగు పెట్టుకుని కటింగ్ చేస్తున్నాడు.

కరోనావైరస్ వ్యాప్తిని నివారించడానికి .. నిరంతరం చేతులు సబ్బుతో శుభ్రపరుచుకోవాలని, సామాజిక దూరం పాటించాలని వైద్యులు చెబుుతున్నారు. కరోనా వైరస్ ను తరిమేయాలంటే… మనమంతా ఇల్లకే పరిమితం కావాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలోని చాలా దేశాల్లో లాక్ డౌన్ చేశారు. అయితే.. కరోనా రాకుండా ఉండేందుకు దుకాణ యజమానులు కూడా తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇందులో భాగంగా హాలాండ్‌లోని బెల్లా రోజ్ సెలూన్‌‌లో హెయిర్ స్టైలిష్ట్.. కరోనా సమయంలోనూ కటింగులు చేస్తోంది. కస్టమర్ల నుంచి తనకు కరోనా సోకకుండా ఉండేందుకు గొడుగును అడ్డంగా పెట్టుకుంటోంది. కళ్లు కనిపించేందుకు ఆ గొడుకు కు రెండు చిన్న రంధ్రాలు చేసింది. అలాగే చేతుల కోసం రెండు పెద్ద రంధ్రాలను చేసింది. కరోనా రాకుండా ఆమె కొత్తగా ఆలోచించినా…. దాని వల్ల ఉపయోగం ఉండదు. కానీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed