- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇన్‌స్టాగ్రామ్ పై హ్యాకర్ల నిఘా
దిశ, వెబ్‌డెస్క్: మీకు తెలియకుండా మీ ఇన్‌స్టా అకౌంట్‌లో ఫోటోలు, మేసేజ్‌లు వెళితే ఆ ఆందోళన అంతా ఇంతా కాదు. దీనికి తోడు మీ పర్సనల్ ఫోటోలు, మీరుండే లోకేషన్ మీకు తెలియకుండా వేరే వాళ్ల ఆధీనంలోకి వెళితే అంతే సంగతులు.. ఇంకోసారి సోషల్ మీడియా ఓపెన్ చేసేందుకు జంకుతారు. ఇంతటి సెన్సెటివ్ విషయంలో హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. ఎంతో మంది మోడ్రన్ యువతను ప్రత్యేకంగా ఆకర్శించిన ఇన్‌స్టాగ్రామ్‌ను అంతకుమించిన స్థాయిలో హ్యాకర్లను కూడా ఆకర్శించింది.
ఇన్‌స్టాగ్రామ్‌ను టార్గెట్ చేసి నెటిజన్ల పర్సనల్ డేటా కోసం హ్యాకర్లు కొత్త బగ్ ఏర్పాటు చేసినట్టు సైబర్ సెక్యూరిటీ నిపుణుల అంచనా కలవరం రేపుతోంది. ఈ బగ్ ప్రత్యేకత ఎంటంటే.. జేపీఈజీ రూపంలో ఇన్‌స్టాలో వచ్చిన ఫోటో పై క్లిక్ చేస్తే చాలు మనకు తెలియకుండా ఇన్‌స్టాను యాక్సెస్ చేసే రిమోట్ రూల్ ఫోన్‌లో సేవ్ అవుతుంది. దీని ఆధారంగా హ్యాకర్లు యూజర్ల టైమ్‌లైన్, పర్సనల్ మేసేజులను ఆపరేట్ చేయగలుతారని నిపుణులు అంచనా వేశారు. కానీ, ఇదే విషయం పై ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను నిపుణులు హెచ్చరించడంతో తగు నివారణ చర్యలు చేపట్టారు.