కొవిడ్ 19 మీద ఆన్‌లైన్ హ్యాకథాన్

by vinod kumar |
కొవిడ్ 19 మీద ఆన్‌లైన్ హ్యాకథాన్
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ 19 మీద ఆన్‌లైన్ హ్యాకథాన్ నిర్వహించనున్నట్లు ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ప్రకటించింది. కొవిడ్ 19 నేషనల్ బయో ఇన్ఫర్మేటిక్స్ ఆన్‌లైన్ హ్యాకథాన్ పేరుతో నిర్వహించే ఈ పోటీలో పాల్గొనాలనుకునేవారు ఏప్రిల్ 26 వరకు ఏఐసీటీఈ ఇండియా వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు.

ఈ హ్యాకథాన్ ఏప్రిల్ 27 నుంచి మే 6 వరకు జరగనుంది. వివిధ మాడ్యూల్స్, సపోర్ట్ కోఆర్డినేషన్ ఉపయోగించి సమగ్ర పాండెమిక్ రెస్పాన్స్ యాప్ లేదా వెబ్ టూల్స్ డెవలప్ చేయడమే ఈ హ్యాకథాన్ లక్ష్యం. అయితే ఈ హ్యాకథాన్‌ ద్వారా అభివృద్ధి చేసిన టూల్స్‌ని వాణిజ్యపరంగా ఉపయోగించొద్దని షరతు విధించారు. వీలైనంత వరకు ఓపెన్ సోర్సుగా లేదా పాక్షిక చెల్లింపు పద్ధతిలో వీటిని వినియోగించుకోనున్నారు. అంతేకాకుండా ఇందులో పాల్గొనే ఫుల్ స్టాక్ డెవలపర్ల్ తమ ఉత్పత్తికి మూల కోడ్ కాకుండా ఇన్‌స్టాల్ చేసుకోగల వెర్షన్లను సమర్పించాల్సి ఉంటుంది. కంప్యూటర్ సైన్స్, పాలిటెక్నిక్, ఐసీటీ, ఇంజినీరింగ్ కాలేజీలు, స్టార్టప్‌లు ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు.

Tags – Hackathon, covid, corona, apps, development, AICTE

Next Story

Most Viewed