- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎర్రకోటపై ఎగిరేది జాతీయ జెండానే :గుత్తా
దిశ, నల్లగొండ: ఎర్రకోటపై జాతీయ జెండానే ఎగురుతోందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది భారీ వర్షాలతో రైతులు నష్టపోయారన్నారు. రైతు పండించిన ప్రతి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. సన్నధాన్యం కొనుగోళ్లలో కొంత గందరగోళం నెలకొని రద్దీ ఏర్పడిందన్నారు. దీంతో టోకెన్లు జారీ చేసి క్రమబద్దీకరణతో కొనుగోలు చేస్తామని చెప్పారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.
కొన్ని రాజకీయ పార్టీలు గోల్కొండపై కాషాయ జెండా ఎగురవేస్తామంటున్నారు.. ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించేలా మాట్లాడుతున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ ను బలహీనపర్చాలని కొంతమంది చూస్తున్నారన్నారు. అలా చేస్తే మనల్ని మనం బలహీన పర్చుకున్నట్లే తెలిపారు. దుబ్బాక విషయమై రాజకీయ పార్టీల్లో గెలుపోటములు సహజమని అన్నారు.