- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాతో మాకేంటి.. మా దందా మాదే
దిశ, ఖమ్మం :
దేశవ్యాప్తంగా కరోనా ఫీవర్ నడుస్తుంటే తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం కొందరు అక్రమార్కులు గుట్టు చప్పుడు కాకుండా గుట్కా దందా కొనసాగిస్తున్నారు. జిల్లాలో లాక్‌డౌన్ అమలవుతున్నప్పటికి పోలీసుల కల్లుగప్పి కిరణా షాపులకు గుట్కా ప్యాకెట్లు సరఫరా చేస్తున్నారు.ఈ మేరకు స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు శనివారం జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్ ప్రాంతంలో దాడులు నిర్వహించి భారీ ఎత్తున గుట్కా నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.వివరాల్లోకి వెళితే..ఓ వ్యక్తి పెద్ద మొత్తంలో గుట్కా ప్యాకెట్లను నిల్వచేసి వ్యాపారస్తులకు సరఫరా చేస్తున్నట్టు తెలుసుకున్న పోలీసులు దాడులు జరిపి సుగ్గాల మధుసుదన్ రావు అనే వ్యక్తిని అరెస్టు చేశారు. చండ్రుగొండకు చెందిన మరో ముగ్గురు నిందితులు సంక శంకర్, వనమ నవీన్, చావ వెంకటేశ్వర్లు పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న గుట్కా, పొగాకు ఉత్పత్తుల విలువ రూ.2లక్షల70వేలకు పైగా ఉంటుందని వివరించారు.ఇకమీదట ఎవరైనా గుట్కా దందా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రైనీ ఐపీఎస్ బి.రోహిత్ రాజ్, చుంచుపల్లి సీఐ అశోక్, ఎస్సై జి.ప్రవీణ్ కుమార్, అధికారులు హెచ్చరించారు.