పగటి కలలు వద్దు.. మళ్లీ అధికారం టీఆర్ఎస్‌దే: గుత్తా సుఖేందర్

by Sridhar Babu |   ( Updated:2021-07-30 04:56:31.0  )
పగటి కలలు వద్దు.. మళ్లీ అధికారం టీఆర్ఎస్‌దే: గుత్తా సుఖేందర్
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని ప్రతిపక్ష నేతలు పగటి కలలు కంటున్నారని, మరోసారి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ ధీమా వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రానికి ఏమి అవసరమో ఆ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని చెప్పారు. నల్లగొండ జిల్లాకు సంబంధించిన మంత్రితో ప్రజల ముందు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మైక్ లాక్కోవడం సరికాదన్నారు. ప్రజాప్రతినిధిగా గెలిచి ఒక మంత్రిని అవమానించడం, దాడికి ప్రయత్నించడం సరైంది కాదని చెప్పుకొచ్చారు. మార్చి బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన పథకాలను ఇప్పుడేదో హుజురాబాద్ బై ఎలక్షన్ల కోసం ప్రవేశపెట్టారని ప్రతి పక్షాలు ప్రచారం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. నాయకులు ప్రాంత అభివృద్ధి కోసం పోటీపడాలి తప్పా.. ఒకరిని ఒకరు కించపరిచే విధంగా ఉండొద్దని గుత్తా హితవు పలికారు.

Next Story

Most Viewed