- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ధూళికట్ట ‘ప్రతిజ్ఞ’ పై ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ క్లారిటీ..
దిశ, వెబ్‌డెస్క్ : పెద్దపల్లి జిల్లా ధూళికట్టలో జరిగిన ఓ కార్యక్రమంలో స్వేరోస్, గురుకులాల సెక్రెటరీ చేసిన ప్రతిజ్ఞ వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. హిందూ దేవుళ్లు, దేవతలకు వ్యతిరేకంగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న పోలీసు అధికారి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని హిందూ సంఘాలు, బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. కమలనాథుల వ్యాఖ్యలపై జైభీమ్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కాన్వాయ్‌ను కోదాడలో అడ్డుకుని నిరసనకు దిగారు. అనంతరం బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
తాజాగా ఈ కాంట్రవర్సీపై గురుకులాల సెక్రెటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. తాను హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఎలాంటి ప్రతిజ్ఞ చేయలేదని స్పష్టం చేశారు. కొంత మంది కావాలనే తనపై హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించాలని చూస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నేతల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. నా భార్య, సోదరి అందరూ హిందువులేనని, తన సోదరి వివాహం హిందూ సంప్రదాయంలో జరిగిందని వివరించారు. నేను స్వేరోస్‌లో సభ్యుడిని.. నా భావజాలం అందులో ఉందని.. అందుకే ఆ కార్యక్రమంలో పాల్గొన్నట్లు చెప్పుకొచ్చారు. దేశంలో హిందూ నాన్ హిందూ విభజన రేఖ పెరుగుతోందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
స్వేరోస్‌కు విదేశాల నుంచి నిధులు వస్తున్నాయని బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తమని కొట్టిపరేశారు. అవసరమైతే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని.. ఒక వేళ నిధులు వచ్చినట్లు తేలితే ఏ శిక్షకైనా తాను సిద్ధమని సవాల్ విసిరారు.