- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యే గోడౌన్‌లో గుట్కా తయారీ
దిశ ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ముస్తఫా గౌస్ పొగాకు గోడౌన్‌లో గుట్టుగా తయారవుతున్న అక్రమ గుట్కా దందాను పోలీసులు రట్టు చేశారు. దీని వివరాల్లోకి వెళ్తే… జిల్లాలో అక్రమ గుట్కా పెద్ద ఎత్తున పట్టుబడుతోంది. దీనిపై పలువురిని విచారించిన పోలీసులు, దీని అంతు తేల్చాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గత కొంత కాలంగా పెదకాకానీ మండలం, కొప్పురావూరు సమీపంలోని ఒక గోడౌన్‌లో అక్రమ గుట్కా తయారవుతోందని, అక్కడి నుంచే జిల్లా వ్యాప్తంగా సరఫరా అవుతుందని పోలీసులు గుర్తించారు.
ఈ క్రమంలో ఆ గోడౌన్ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ముస్తఫా గౌస్‌కి చెందినదని కూడా తెలుసుకున్నారు. ఇంతలో గోడౌన్‌లో అక్రమ గుట్కా తయారీ జరుగుతోందని, రవాణాకు సిద్ధంగా ఉందని ఎస్పీ అమ్మిరెడ్డికి విశ్వాసనీయ సమాచారం అందింది. దీంతో స్పెషల్ టీమ్‌తో రంగంలోకి దిగిన అమ్మిరెడ్డి… గోడౌన్‌లో సోదాలు జరిపి, సుమారు కోటి రూపాయల విలువైన గుట్కా సామాగ్రి, ప్యాకెట్లు, యంత్రాలు పట్టుకున్నారు. పాన్ మసాలా తయారీ కోసం సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి పేరిట అనుమతులు తీసుకున్న నిందితులు.. పాన్ మాసాలాతోపాటు టెంపర్ బ్రాండ్ నేమ్‌తో గుట్కాను తయారు చేసి అక్రమ రవాణా చేస్తున్నట్టు నిర్ధారించుకుని అక్కడి వారిని అదుపులోకి తీసుకున్నారు.