కలెక్టర్‌కు కరోనా.. అధికారులంతా క్వారంటైన్

by Anukaran |   ( Updated:2020-07-21 10:32:38.0  )
కలెక్టర్‌కు కరోనా.. అధికారులంతా క్వారంటైన్
X

దిశ, ఏపీ బ్యూరో :
ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. తూర్పుగోదావరి, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ఆ మహమ్మారి ప్రభావం ప్రమాదకర స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. ఈ మూడు జిల్లాల్లో ప్రతిరోజు సగటున 500కు పైగా కేసులు నమోదవుతున్నాయి. కేవలం ఈ మూడు జిల్లాల్లో కలిసి పాజిటివ్ కేసుల సంఖ్య 6 వేలు దాటిందంటే అతిశయోక్తి కాదు. ఇదిలాఉండగా గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు 63 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ ఉధృతి కొనసాగుతుండగానే ఏకంగా గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కరోనా బారిన పడటం కలకలం రేపింది. కరోనా సేవలు నిత్యం పర్యవేక్షించే క్రమంలో ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో, ఆయన హోం క్వారంటైన్‌కు వెళ్లిపోయారు. అంతేకాదు, కలెక్టర్ ఛాంబర్‌ను కూడా తాత్కాలికంగా మూసేశారు. జాయింట్ కలెక్టర్, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్, జిల్లా వైద్య అధికారి, పలువురు జిల్లా అధికారులకు కూడా కరోనా పాజిటివ్ తేలింది. దీంతో వారంతా క్వారంటైన్‌కు వెళ్లిపోయారు.

Advertisement

Next Story

Most Viewed