- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అన్నదాతల ఆవేదన.. మమ్మల్ని ఆదుకోండి సారూ..!
దిశ, గుండాల : గత కొన్ని రోజులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్వప్రయోజనాల కోసం మా పేర్లు వాడుకుంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ తమను రోడ్లపై వదిలేశారని గుండాల మండల పరిధిలోని గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వరి కొనుగోలు విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిందలు వేసుకోవడం మాని తమను పట్టించుకోవాలని కన్నీటి పర్యంతం అవుతున్నారు.
ఇటీవల కురిసిన అకాల వర్షాల వలన వరి ధాన్యం తడిసి ముద్దయ్యింని, వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. మండలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఇంకా మొదలు కాలేదని మండిపడ్డారు. మండలంలో దాదాపు 100 క్వింటాళ్ల పైన ధాన్యం అకాల వర్షానికి తడిసిపోయిందని బాధిత రైతులు వాపోయారు.