గుల్షన్ కుమార్ హత్యకేసులో హైకోర్టు సంచలన తీర్పు

by Shamantha N |
Gulshan-Kumar
X

ముంబై : టీ సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ హత్య కేసులో తుది తీర్పును బాంబే హైకోర్టు గురువారం వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అబ్దుల్ రౌఫ్ దోషిగా నిర్ధారిస్తూ 2002లో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును బాంబే హైకోర్టు సమర్థించింది.

1997, ఆగ‌స్టు 12న జూహూలో ఓ ఆలయం నుంచి బయటకు వస్తుండగా గుల్షన్ కుమార్‌పై కాల్పులు జరిపారు. ఈ కేసులో మర్చంట్ రౌఫ్‌ను కోర్టు దోషిగా తేల్చి ట్రయల్ కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. కాగా ఈ కేసులో మర్చంట్ సోదరుడు అబ్దుల్ రషీద్ దావూద్‌ను నిర్దోషిగా విడుదల చేయాలన్న ట్రయల్ కోర్టు ఆర్డర్‌ను బాంబే హైకోర్టు పక్కకు పెట్టి అతనికి జీవిత ఖైదు విధించింది.

విచారణ సందర్భంగా జస్టిస్ ఎస్ఎస్ జాదవ్, జస్టిస్ ఎన్ఆర్ బోర్కర్ లతో కూడిన ధర్మాసనం మాట్లాడుతూ.. ‘అబ్దుల్ రౌఫ్‌కు గతంలో నేర చరిత్ర ఉంది. గతంలో అరెస్టైన తర్వాత అతను తప్పించుకుని పారిపోయాడు. కాబట్టి అతను విడుదలకు అనర్హుడని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2009లో పెరోల్ మీద విడుదలై పారిపోవడం, మల్లీ నేర కార్యకలాపాలు కొనసాగించడం వంటి కారణాల వల్ల అతడు క్షమకు అనర్హుడు’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Advertisement

Next Story

Most Viewed