- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుజురాబాద్‌లో కేసీఆర్‌కి షాక్.. గల్ఫ్ బంధు అమలు చేయాలని డిమాండ్
దిశ ప్రతినిధి, కరీంనగర్: దళిత బంధు తరహాలోనే గల్ఫ్ వాపసీల కోసం గల్ఫ్ బంధు అమలు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కార్మికులు ఉపాధి కోసం విదేశాలకు వలస వెళ్లి తిరిగి వచ్చిన వారి కోసం ఈ పథకం అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ని కోరుతున్నారు. గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2న హుజురాబాద్ నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి గల్ఫ్ రిటర్న్ అయిన వారు హాజరు కానున్నారు. ఉన్న ఊళ్లో ఉపాధి లేక ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లి అప్పుల పాలైన వారిని ఆదుకోవాలన్న డిమాండ్ వినిపించాలని ఈ సంఘం నిర్ణయించింది. గల్ప్ వర్కర్స్ చే ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించామని నిర్వహకులు మంద బీం రెడ్డి తెలిపారు. గల్ప్ కార్మికుల కోసం కూడా ప్రత్యేకంగా గల్ఫ్ బంధు పథకం అమలు చేయాలని కోరుతున్నామన్నారు.