విష్ణుమూర్తి పదో అవతారం నేను.. రూ.16 లక్షలు ఇవ్వకపోతే శపిస్తా!

by Shamantha N |   ( Updated:2021-07-06 02:08:17.0  )
vishnu murthi news
X

దిశ, ఫీచర్స్ : “నేను విష్ణుమూర్తి పదో అవతారాన్ని.. రూ.16లక్షలు ఇవ్వకపోతే శపిస్తా” అంటూ గుజరాత్ లో ఓ వ్యక్తి హల్ చల్ చేస్తున్నాడు. గుజరాత్‌కు చెందిన రమేష్ చంద్ర ఫెఫర్, సర్దార్ సరోవర్ పునరావాస ఏజెన్సీలో సూపరింటెండింగ్ ఇంజనీర్‌గా వర్క్ చేసేవాడు. అయితే 2018 నుంచి ఆఫీస్‌కు రావడమే మానేసిన ఆయన ప్రపంచ మనస్సాక్షిని మార్చేందుకు ఆఫీస్ కార్యాలయం అనువైంది కాదని, అందుకే తను రాలేకపోయానని చెప్పుకుంటూ తిరిగేవాడు. ఈ క్రమంలోనే జూలై 1న ప్రభుత్వ జలవనరుల శాఖకు రమేష్ చంద్ర ఒక లెటర్ రాశాడు. ఆ లేఖలో ” ప్రభుత్వంలో కూర్చున్న రాక్షసులు తన జీతం, గ్రాట్యుటీని నిలిపేసి, తనను వేధిస్తున్నారని.. భగవంతుడి పదో అవతారమైన తనని ఇలాగే వేధిస్తే గుజరాత్‌లో కరువు వచ్చేలా శపిస్తానని రాసుకొచ్చాడు. అంతేకాకుండా తాను నిజంగానే కల్కి అవతార్ అని, తన తపస్సు కారణంగానే దేశంలో రెండేళ్లుగా వర్షాలు కురుస్తున్నాయని, హిందూస్థాన్‌కు రూ. 20లక్షల కోట్లకు పైగా లాభం చేకూరుతుందని లేఖలో పేర్కొన్నాడు.

అందరిలాగే కరోనా టైమ్‌లో ఇంటి నుంచి వర్క్ చేసిన తనకు గుజరాత్ సర్కార్ తనకు రూ .16 లక్షలు బాకీ ఉందని, వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశాడు. 2010లో ఆఫీస్‌లో ఉన్నప్పుడే తాను కల్కి అవతార్ అని గ్రహించానంటున్న ఫెఫర్.. తాను ఎన్నో దైవిక శక్తులను సంపాదించానని తెలిపాడు. కరోనా వైరస్ సంక్షోభాన్ని తీసుకొచ్చింది తానేనని, దీని నుంచి ఎవరూ తెప్పించుకోలేరని అంటున్నాడు. “సీతారాం మంత్రాన్ని వేలాది సార్లు జపించడం” వల్ల నివారణ కలుగుతుందని తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed