- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుడ్‌న్యూస్: ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ శాఖలకు మార్గదర్శకాలు
దిశ, తెలంగాణ బ్యూరో : జోనల్వ్యవస్థ, స్థానికతపై ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. జోన్ల సవరణ ఉత్తర్వులను అనుసరిస్తూ ఆయా ప్రభుత్వ శాఖలకు క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలో కొత్త జోనల్వ్యవస్థ ప్రకారం 33 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్ల పరిధి ఖరారు చేయడమే కాకుండా స్థానికులకు ఉద్యోగాలు అంశంలో ప్రభుత్వం స్పష్టం చేస్తూ జీఏడీ ప్రోటోకాల్, సర్వీసు ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్‌రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం ఒకటి నుంచి 7వ తరగతి వరకు ఎక్కువ కాలం ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లాలో స్థానికులుగా పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. ఇప్పటి వరకు ఉన్న రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టుల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఇకపై ఉండదు. వాటిని మల్టీ జోన్ పరిధిలోనే భర్తీ చేయనున్నట్లు కొత్త జీవోలో స్పష్టం చేసింది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఉత్తర్వులు–2018కు కేంద్రం సవరణ చేసి, ఈ ఏడాది ఏప్రిల్19న తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ సవరణ ఉత్తర్వులు–2021ను జారీ చేసింది. మల్టీ జోన్–1 కింద కాళేశ్వరం, బాసర, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి జోన్లు, మల్టీజోన్– 2 కింద యాదాద్రి, చార్మినార్, జోగుళాంబ జోన్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజా ఆదేశాల ప్రకారం ఇకపై వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగాల్లో ఈ జోన్లే ప్రామాణికం కానున్నాయి. పోలీసు శాఖకు మాత్రం ప్రత్యేకంగా జోన్లను ఏర్పాటు చేసింది. పోలీసు కమిషనరేట్ల పరిధి ఒకటికి మించి జిల్లాల్లో విస్తరించి ఉన్న కారణంగా మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. గతంలో గ్రూప్–1 పోస్టులు స్టేట్ కేడర్‌కే పరిమితమై ఉండేవి. కానీ ఇప్పుడు మల్టీజోన్ పరిధికి తీసుకువచ్చారు. దీనితో తెలంగాణ నిరుద్యోగులకు గ్రూప్–1లో కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అయితే గ్రూప్–1 నోటిఫికేషన్‌కు కూడా క్లియర్ అవుతోంది. దీంతో గ్రూప్–1 నోటిఫికేషన్ కూడా త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంటోంది.
స్థానికులకు ఉద్యోగాలు… ఉద్యోగులకే పదోన్నతులు
జిల్లా, జోనల్ స్థాయిలో స్థానికులకు 95 శాతం ఉద్యోగాలు లభించడం మాత్రమే కాకుండా… రాష్ట్రస్థాయి పోస్టుల విధానం తొలగింపుతో కీలకమైన ఆ పోస్టులు ప్రస్తుతం జోనల్ విధానంలో ఉన్న ఉద్యోగులకే పదోన్నతిపై దక్కనున్నాయి. ప్రస్తుతం జిల్లాస్థాయి పోస్టుల్లో 80 శాతం స్థానికులకు, 20 శాతం ఓపెన్ కేటగిరీ, జోనల్‌లో 70 శాతం స్థానికులకు, 30 శాతం ఓపెన్ కేటగిరీ, మల్టీజోన్‌లో స్థానికులకు 60 శాతం, ఓపెన్ కేటగిరీలో 40 శాతం విధానం ఉంది. కొత్త విధానంలో రాష్ట్రస్థాయి కేడర్‌నే తొలగించింది. మిగతా అన్ని కేడర్లలో స్థానికులకు 95 శాతం, ఓపెన్ కేటగిరీలో 5 శాతం రిజర్వేషన్ వర్తింప చేస్తున్నట్లు వెల్లడించారు. జోన్ల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ప్రభుత్వం డైరెక్టు రిక్రూట్‌మెంట్ విధానం నుంచి 34 రకాల స్టేట్ కేడర్ (స్పెసిఫైడ్ గెజిటెడ్ కేటగిరీ) పోస్టులను తొలగించింది. వాటిని మల్టీ జోనల్ పరిధిలోకి తెచ్చి భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. కొత్త జోనల్, జిల్లా విధానం అమల్లోకి వస్తే ఆ ఉద్యోగాలు వచ్చిన వారు సర్వీసుపరంగా నష్టపోకుండా చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే పోస్టుల భర్తీ ప్రక్రియను మల్టీజోనల్ స్థాయిలో చేసినా, పోస్టింగ్‌లు మాత్రం రాష్ట్రస్థాయి కేడర్‌లో ఇచ్చేలా చర్యలు చేపట్టింది. తద్వారా కన్‌ఫర్మ్‌డ్ ఐఏఎస్, ఐపీఎస్‌లుగా ప్రమోట్ అయ్యే వారికి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఆ పోస్టులు తెలంగాణ నిరుద్యోగులకే వచ్చేలా చర్యలు చేపట్టింది. మల్టీజోనల్‌లో వాటిని భర్తీ చేయడం ద్వారా 95 శాతం రాష్ట్రస్థాయి పోస్టులు తెలంగాణ వారికే లభించనున్నాయి. గతంలో రాష్ట్రస్థాయి పోస్టుల్లో లోకల్ రిజర్వేషన్లు 50 శాతం మినహాయిస్తే మిగతా పోస్టులకు ఎవరైనా పోటీ పడే వీలుండగా ఇప్పుడది సాధ్యం కాదు. మల్టీజోనల్ ఓపెన్ కోటా కేవలం 5 శాతమే ఉన్నందున ఇతర రాష్ట్రాల వారు పెద్దగా వచ్చే వీలుండదు.
క్లియర్
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీలో పరిగణనలోకి తీసుకోవాల్సిన కొత్త జోన్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత ఇస్తూ తుది జీవోను శుక్రవారం విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలతో కొత్త జోన్లను అమల్లోకి తీసుకుంటూ (తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ) సవరణ ఉత్తర్వులు– 2021గా అమలు అవుతాయని పేర్కొన్నారు. తాజాగా విడుదల చేసిన జీవో, దాని అనుబంధ ఆదేశాల ప్రకారం.. జూనియర్ అసిస్టెంట్, దీనికి సమానమైన, దీనికంటే తక్కువ కేడర్ పోస్టులను ప్రత్యేక కేటగిరీగా పేర్కొన్నారు. మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్, ప్రభుత్వ పాఠశాలల్లోని నాన్ గెజిట్ కేటగిరీలోని టీచర్ల పోస్టులను జిల్లా యూనిట్‌గా ఒక కేడర్‌గా భావిస్తారు. జూనియర్ అసిస్టెంట్ పైస్థాయికి సమానమైన పోస్టుల నుంచి సూపరింటెండెంట్, దీనికి సమానమైన పోస్టులను ప్రత్యేక కేడర్‌గా పేర్కొన్నారు. ఈ పోస్టులు జోన్ పరిధిలో ఉంటాయని తెలిపారు. సూపరింటెండెంట్‌పై స్థాయికి సమానమైన పోస్టుల నుంచి డిప్యూటీ కలెక్టర్ పోస్టు వరకు ఉండే అన్ని రకాల పోస్టులను మల్టీజోనల్ పోస్టులుగా నిర్ధారించారు.
అన్ని స్థానిక కేడర్లలోని ఉద్యోగుల ఉన్నతస్థాయి పదోన్నతులకు సమాన అవకాశాలు ఉంటాయి. లోకల్ కేడర్ నుంచి ఇతర ఆఫీసులకు, సంస్థలకు ఒక ఉద్యోగిని బదిలీ చేయడానికి ఈ ఉత్తర్వు వర్తించదు. ఒక లోకల్ కేడర్ నుంచి మరో లోకల్ కేడర్‌కు బదిలీ జరగాలి. ప్రతి మల్టీజోన్ ఒక లోకల్ ఏరియాగా ఉంటుంది. కొన్ని మినహా అన్ని రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థల పోస్టులు వీటి పరిధిలో ఉంటాయి. ఈ కేడర్ పోస్టుల భర్తీ విషయంలో లోకల్ కేడర్ నుంచి సమానావకాశాలు వర్తిస్తాయి. లోకల్ కేడర్ అధికారిని ఏ కార్యాలయానికైనా బదిలీ చేయవచ్చని పేర్కొన్నారు. ఒక లోకల్ కేడర్‌లో ఉన్న ఉద్యోగిని ఇతర లోకల్ కేడర్‌కు బదిలీ చేయొచ్చు. ప్రతి జిల్లా ఒక లోకల్ ఏరియాగా ఉంటుంది. అలాగే ప్రతి జోన్‌ను ఒక లోకల్ ఏరియాగా పరిగణిస్తారు. మల్టీజోన్ విషయంలోనూ ఇదే విధంగా ఉంటుంది. ఒకటికంటె ఎక్కువ జిల్లాల్లోని ఒకే కేడర్ పోస్టులుగా ఉండే పోస్టులను ప్రత్యేక కేడర్‌గా పరిణగిస్తారు. జోన్, మల్టీజోన్ విషయంలోనూ ఇదే తరహా విధానం ఉంటుంది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కు అర్హత సాధించే వ్యక్తి అక్కడ స్థానికుడిగా ఉంటారు. పోస్టుల వారీగా పేర్కొనే నిబంధనల ప్రకారం ఈ స్థానికతను పరిగణనలోకి తీసుకుంటారు. తెలంగాణ ప్రభుత్వ అమోదిత విద్యా సంస్థల్లో వరుసగా నాలుగేళ్లు చదివిన వారిని స్థానికులుగా పరిగణిస్తారు. చదివిన జిల్లాలను స్థానిక జిల్లాగా పేర్కొంటారు.
దీంతో జిల్లా, జోనల్, మల్టీజోనల్ పరిధిలోని అన్ని పోస్టుల భర్తీలో స్థానికులకు ప్రాధాన్యత ఉంటుంది. అన్ని విభాగాల్లోనూ 95 శాతం పోస్టులను డెరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద భర్తీ చేస్తారు. ఇలా భర్తీ చేసే 95 శాతం పోస్టుల్లో పూర్తిగా స్థానికులకే అవకాశం ఉంటుంది. ఈ మేరకు రిజర్వేషేన్లు కల్పిస్తారు. ఓపెన్ కేటగిరీ కింద 5 శాతం మాత్రమే ఉంటాయి. స్థానిక అభ్యర్థులు లేకపోవడం వల్ల ఖాళీగా మిగిలే పోస్టులను తర్వాత స్థానికులకే చెందేలా క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఇక సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, ప్రత్యేక కార్యాలయాలు, కొత్తగా ఏర్పాటు చేసే కార్యాలయాలు, రాష్ట్రస్థాయి కార్యాలయాలకు జోనల్ విధానంలోని నిబంధనలు వర్తించకుండా స్పష్టం చేశారు. ఆయా కార్యాలయాల్లోని సిబ్బందిని మాత్రం జిల్లాల్లోని కార్యాలయాలకు పరస్పరం బదిలీ చేయవచ్చని పేర్కొన్నారు.
ఇక పోలీసు నియామకాల్లో కొత్త జోన్లు, మల్టీ జోన్లే ప్రామాణికం కానున్నాయి. ఇకపై చేపట్టనున్న నియామకాల ప్రకారం.. కానిస్టేబుళ్లు ఎంపికైన జిల్లాల వారీగా, ఎస్సైలు ఎంపికైన జోన్లలో పనిచేయాల్సి ఉంటుంది. ఇక ఇన్‌స్పెక్టర్ ర్యాంకు ఆఫీసర్లు మల్టీజోన్లకు పరిమితం కావాల్సి ఉంటుంది. అంటే ఇన్‌స్పెక్టర్లు మల్టీజోన్లలో ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడ పని చేయాల్సి ఉంటుంది.
మల్టీజోన్ పరిధిలోకి వచ్చే స్టేట్ కేడర్ పోస్టులివీ
డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, రీజనల్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్, కో-ఆపరేటివ్ సొసైటీ డిప్యూటీ రిజిస్ట్రార్, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, డివిజనల్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్, లేబర్ సెక్రటరీ అండ్ గ్రేడ్-2 ట్రెజరర్, అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు (కమ్యూనికేషన్స్), అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్, పాలిటెక్నిక్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, స్టాటిస్టిక్స్‌శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, గనులశాఖ అసిస్టెంట్ డైరెక్టర్, మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, ఆయుష్ డిపార్ట్‌మెంట్ లెక్చరర్స్, గ్రేడ్-అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్.
జోనల్ పరిధిలోకి వచ్చే గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులివీ
గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ తహసీల్దార్, గ్రేడ్-2 సబ్ రిజిస్ట్రార్, జూనియర్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్, కో-ఆపరేటివ్ సబ్‌రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్, మార్కెటింగ్ అసిస్టెంట్ డైరెక్టర్, చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్, ఇండస్ట్రీస్ అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, జూనియర్ లెక్చరర్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, హార్టీకల్చర్ ఆఫీసర్, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్, ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ట్యూటర్, ఫిజికల్ డైరెక్టర్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్, ఆయుష్ మెడికల్ ఆఫీసర్.