గుడ్‌న్యూస్ : కరోనా పరికరాలు, మెడిసిన్స్‌పై GST తగ్గింపు

by Anukaran |
nirmala-seeta-raman 1
X

దిశ, వెబ్‌డెస్క్ : జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. శనివారం జీఎస్టీ కౌన్సిల్ మీట్ అనంతరం ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. కరోనా వ్యా్క్సిన్‌పై 5 శాతం పన్ను యథావిధిగా కొనసాగుతుందన్నారు. కరోనా చికిత్సకు ఉపయోగించే 3 మందులకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంటుందన్నారు.

కరోనా మందులు, చికిత్సకు ఉపయోగించే పరికరాలపై, టెంపరేచర్ చూసే పరికరాలపై 5 శాతం, అంబులెన్సులపై 12శాతం జీఎస్టీని తగ్గించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. బ్లాక్ ఫంగస్‌కు ఉపయోగించే మందులు, కరోనా మందులు, టెస్టింగ్ కిట్స్ పై జీఎస్టీ పెంపు ఉండదన్నారు. ఆక్సిజన్ యూనిట్లు, టెస్టింగ్ కిట్లు, పల్స్ ఆక్సిమీటర్లపై జీఎస్టీని తగ్గించినట్లు స్పష్టం చేశారు. శ్మనానాల్లో వాడే ఎలక్ట్రిక్ ఫర్నెస్ పై 5శాతం, హ్యాండ్ శానిటైజర్లు, మెడిసిన్‌పై జీఎస్టీని తగ్గిస్తూ కౌన్సిల్ నిర్ణయించింది.

Advertisement

Next Story

Most Viewed