అవకతవకలుంటే రిజిస్ట్రేషన్ సస్పెన్షన్

by Harish |
అవకతవకలుంటే రిజిస్ట్రేషన్ సస్పెన్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసిన జీఎస్టీ అమ్మకాల రిటర్నులు లేదా జీఎస్టీఆర్-1 ఫారమ్‌లలో ఏవైనా తేడాలు కానీ, అవకతవకలు కానీ ఉంటే అధికారులు వెంటనే రిజిస్ట్రేషన్‌ను సస్పెండ్ చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్(సీబీఐసీ) ‘స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్(ఎస్ఓపీ)’ జారీ చేసింది. వారి సరఫరాదారులు రిటర్నులతో పోల్చినపుడు ఎలాంటి బేధాలు ఉండకూడదని ఇందులో పేర్కొన్నారు. దీనివల్ల పన్ను ఎగవేతలను అరికట్టడం, ఆదాయాలను కాపాడటానికి వీలవుతుంది. లోపాలు ఉన్న రిటర్న్ దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్‌ను సస్పెండ్ చేసిన తర్వాత వివరాలను పొందుపరిచిన ఓ నోటీసును ఎస్ఓపీ సిద్ధం చేస్తుంది. అనంతరం నోటీసును పన్ను చెల్లింపుదారుల ఈ-మెయిల్‌కు పంపిస్తుంది. వీరు 30 రోజుల్లోగా వారి పన్నుల అధికారికి తమ రిజిస్ట్రేషన్ రద్దుకు సంబంధించి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వివరణను కామన్ పోర్టల్ ద్వారా పన్నుల అధికారికి పంపించాలి. కాగా, జీఎస్టీ అధికారులు ఇప్పటికే నకిలీ ఇన్‌వాయిస్‌లపై దృష్టి సారించారు. ఈ చర్యలతో గడిచిన కొన్ని నెలలుగా జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. ఈ క్రమంలోనే ఇటీవల జీఎస్టీ వసూల్లు ప్రతి నెలా రూ. లక్ష కోట్లను దాటుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో రికార్డు స్థాయిలో రూ. 1.20 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదైన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed