ఈ నెల 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం!

by Harish |
ఈ నెల 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా వ్యాపించిన తర్వాత తొలిసారి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. జీఎస్టీ కౌన్సిల్ 40వ సమావేశం జూన్ 12న జరిగే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో రాష్ట్ర ఆర్థిక మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం నిర్వహించనున్నారు. కరోనా వైరస్ ప్రభావం పన్ను ఆదాయాలపై ఎలా ఉందనే అంశంపై చర్చించే అవకాశమున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అలాగే, ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలనే మార్గాలపై కూడా కౌన్సిల్ చర్చించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం లాక్‌డౌన్ తర్వాత నిత్యావసర వస్తువులకు మాత్రమే ఉన్న డిమాండ్, అన్ని రకాల వస్తువులకు పెరిగేలా.. అన్ని రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలను మెర్చుగుపరిచాలని కౌన్సిల్ భావిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన జీఎస్టీ గణాంకాలను కేంద్రం వెల్లడించలేదు. వసూళ్లు భారీగా పడిపోవడం, రిటర్నుల దాఖలుకు గడువు పొడిగింపుతో కేంద్రం తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటోంది. జీఎస్టీ కౌన్సిల్ చివరిగా మార్చి 14న జరిగింది.

Advertisement

Next Story

Most Viewed