- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ. లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు !
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే అత్యధిక స్థాయిలో జీఎస్టీ వసూలైంది. గత నెలతో పోలిస్తే ఐదు శాతం వృద్ధి సాధించామని, కరోనా పరిస్థితుల నుంచి బయట పడుతున్నామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సంతృప్తి వ్యక్తం చేశారు. అక్టోబరు మాసంలో దేశవ్యాప్తంగా వసూలైన జీఎస్టీ రూ. 1.05లక్షల కోట్లు అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వసూలైన పన్నుతో పోలిస్తే ఇదే అత్యధికం. గతేడాది అక్టోబరు మాసం (రూ. 95,379 కోట్లు)తో పోలిస్తే పది శాతం ఎక్కువని పేర్కొంది. తెలంగాణలో సైతం ఐదు శాతం వృద్ధి నమోదైంది. గతేడాది అక్టోబరులో రూ.3,230కోట్లు వసూలుకాగా ఈసారి కరోనా పరిస్థితులు ఉన్నప్పటికీ రూ. 3,383 కోట్లు వసూలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు గతేడాది అక్టోబరుతో పోలిస్తే 26% ఎక్కువగా నమోదైంది. దక్షిణాది రాష్ట్రాలైన కర్నాటక, కేరళ, తమిళనాడుల్లో కూడా వృద్ధి రేటు నమోదైంది. ఢిల్లీ సహా ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రమే నెగెటివ్ వృద్ధి రేటు చోటుచేసుకుంది.
అక్టోబరు మాసానికి వసూలైన జీఎస్టీలో సెంట్రల్ జీఎస్టీ రూ.19,193కోట్లుకాగా, ఎస్‌జీఎస్టీ రూ. 25,411 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.52,540 కోట్లు. ఇందులో దిగుమతులపై వసూలు చేసిన రూ.23,375కోట్లు, సెస్ రూపంలో వసూలు చేసిన రూ. 8,011 కోట్లు కూడా ఉన్నాయి. ఈ మాసానికి సుమారు 80లక్షల వ్యాపార సంస్థలు జీఎస్‌టీఆర్-3బి రిటన్‌లను దాఖలు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొంది. కరోనా పరిస్థితుల నుంచి ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటూ ఉందని, ఏప్రిల్ మాసంలో కేవలం రూ. 32,172 కోట్లు మాత్రమే వసూలుకాగా ఆ తర్వాత ప్రతీ నెలా పెరుగుతూ ఉందని, ఆగస్టు మాసంలో మాత్రమే స్వల్పంగా తగ్గిందని పేర్కొంది.
తెలంగాణలో ఐదు శాతం వృద్ధి
కరోనా పరిస్థితుల్లోనూ తెలంగాణలో ప్రతీ నెలా జీఎస్టీ వసూళ్ళు గణనీయంగా పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ. 928కోట్లు మాత్రమే వసూలుకాగా ఆ తర్వాతి నెల నుంచి పెరుగుతూ వచ్చాయి. ప్రతీ నెలా వృద్ధి రేటు నమోదవుతూ ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకు ఏడు నెలల్లో మొత్తం రూ. 17,940 కోట్లు వసూలయ్యాయి. గతేడాది (2019-20) మొత్తం రూ.39,820 కోట్లు వసూలయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం అంచనా ప్రకారం ఏడు నెలల కాలానికి సగటున సుమారు రూ. 23,228 కోట్లు వసూలు కావాల్సి ఉండగా సుమారు రూ.18వేల కోట్లు వసూలయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వసూలైన నెలవారీ జీఎస్టీ వివరాలు (కోట్ల రూ.లలో) :
ఏప్రిల్ : 928
మే : 1,888
జూన్ : 3,276
జూలై : 2,876
ఆగస్టు : 2,793
సెప్టెంబరు : 2,796
అక్టోబరు : 3,383