- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీఎస్టీ వసూళ్లు.. మరోసారి రూ. లక్ష కోట్లు!
దిశ, వెబ్‌డెస్క్ : ఐటీ అధికారులు తీసుకున్న పన్ను ఎగవేత నిరోధక చర్యల నేపథ్యంలో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) ఫిబ్రవరికి వరుసగా నాలుగో నెలలోనూ రూ. లక్ష కోట్ల వసూళ్లు దాటాయి. ఫిబ్రవరిలో జీఎస్టీ ఆదాయ సేకరణ రూ. 1.05 లక్షలు. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే 12 శాతం వృద్ధి నమోదైందని అధికారులు చెబుతున్నారు. అయితే 2020, జనవరిలో వసూలైన జీఎస్టీ కంటే కొంత తగ్గింది.
వస్తువు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు జనవరి నెలలో రూ. 1.10 లక్షల కోట్లు వసూలైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి నెలకు గానూ రూ. 1.05 లక్షల కోట్లు వసూలైనట్టు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఫిబ్రవరిలో వసూలైన మొత్తంలో సెంట్రల్ జీఎస్టీ(సీజీఎస్టీ) రూ. 20,569 కోట్లు కాగా, రాష్ట్ర జీఎస్టీ(ఎస్‌జీఎస్టీ) రూ. 27,348 కొట్లు, ఐజీఎస్టీ(ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్) రూ. 48,503 కోట్లు నమోదయ్యాయి. నెలవారి సెస్ రూ. 8,947 కోట్లుగా నమోదయ్యాయి.
ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటిస్తూ…’2020, ఫిబ్రవరి నెలలో వసూలైన స్థూల జీఎస్టీ ఆదాయం రూ. 1,05,366 కోట్లు. అందులో, సీజీఎస్టీ రూ. 20,569 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూ. 27,348 కోట్లు, ఐజీఎస్టీ రూ. 48,503 కోట్లు, సెస్ రూ. 8,947 కోట్లని.. గతేడాది ఫిబ్రవరిలో వచ్చిన ఆదాయం కంటే ఈసారి 12 శాతం వృద్ధి నమోదైంది ‘ అని వివరించింది.
Tags : GST Collection, GST Collection In Feb, Ministry Of Finance, Goods And Services Tax, CGST, SGST, IGST