కరోనా వ్యాక్సిన్ గురించి జీఎస్కే గుడ్‌న్యూస్

by sudharani |
కరోనా వ్యాక్సిన్ గురించి జీఎస్కే గుడ్‌న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్: కరోనాకు వృక్ష ఆధారిత వ్యాక్సిన్ కోసం ఫార్మా రంగ దిగ్గజం గ్లాక్సో స్మిత్ క్లైన్-జీఎస్కే పరిశోధనలు చేస్తోంది. ఇందుకోసం కెనడాకు చెందిన మెడికాగో అనే బయో ఫార్మాస్యూటికల్ సంస్థతో కలిసి ప్రయోగాలు చేస్తోంది. ఈ వ్యాక్సిన్ రెండు పదార్థాల సమ్మిళితం అని చెప్పవచ్చు. జీఎస్కే తయారుచేసిన సహాయక ఔషధానికి, మెడికాగో రూపొందించిన కరోనా వైరస్ ను పోలిన కణాలను జోడించి వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశారు. ఈ వ్యాక్సిన్ లో ఉండే కరోనా తరహా కణాలు సార్స్ కోవ్-2ను అనుకరిస్తాయి. ఈ వ్యాక్సిన్ ను మనుషులపై ప్రయోగించినప్పుడు, ఇందులోని కరోనాను పోలిన కణాలను గుర్తించిన వ్యాధి నిరోధక వ్యవస్థ వెంటనే ప్రేరేపితమనున్నది. ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున, ఇది వచ్చే ఏడాది ద్వితీయార్థం నాటికి అందుబాటులోకి రానున్నట్లు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed