- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి మండపంలో బట్టలు విప్పి రెచ్చిపోయిన వరుడు.. షాక్ ఇచ్చిన వధువు
దిశ, వెబ్ డెస్క్: పెళ్లి వేడుక … బంధువులు, అతిథులతో కల్యాణ మండపం కళకళలాడుతుంది. పెళ్లి కూతురి ముఖంలో పెళ్లి కళ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గుర్రం మీద రాజకుమారుడిలా వస్తున్న భర్తను తలుచుకొని రాకుమారిలా ఎదురుచూస్తోంది.. మరోపక్క పెళ్లికూతురు తల్లిదండ్రులు మాత్రం భయాందోళనలో మునిగిపోయారు. అల్లుడుకి కట్నం కింద ఇస్తామన్న బైక్ బదులు వేరే బైక్ ఇస్తునందుకు ఒకింత భయంగా ఉన్నా, పెళ్లి సజావుగా సాగుతుందనే నమ్మకంతో ఉన్నారు. ఇంతలోనే అల్లుడు గారు గుర్రం మీద విచ్చేసారు. అందరు పెళ్లి తంతుకు రెడీ అయ్యారు. ఇంతలో వరుడు కట్నం కింద ఇస్తానన్న బైక్ ఏది అని అడిగాడు. తానూ చెప్పిన బైక్ కాకుండా వేరే బైక్ ఇచ్చినందుకు వరుడు ముఖంలో రంగులు మారాయి.. పెళ్లి వద్దు .. గిల్లీ వద్దు అంటూ రచ్చ చేసి, పెళ్లిని క్యాన్సిల్ చేసిన విచిత్ర ఘటన యూపీలోని హత్రాస్ సిటీలో చోటుచేసుకుంది.
యూపీలోని హత్రాస్ పట్టణంలోని అమర్‌పురఘనా ప్రాంతంలో ఉన్నా ఒక గ్రామానికి చెందిన యువకుడికి పక్క గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. పెళ్ళిలో వరుడుకు బులెట్ బైక్ ఇస్తామని యువతి తల్లిదండ్రులు చెప్పారు. అంతా ఓకే అనుకున్నాక వివాహ తేదీని ఖరారు చేశారు. అయితే యువతి తల్లిదండ్రులు కొన్ని కారణాల వలన బులెట్ బదులు అపాచే బైక్ ని కొనుగోలు చేసారు. పెళ్లిలో ఆ బైక్ నే వరుడుకి ఇచ్చారు. దీంతో రెచ్చిపోయిన వరుడు గుర్రం దిగి నానా హంగామా చేశాడు. నేను అడిగిన బైక్ ఏంటి? మీరిచ్చిన బైక్ ఏంటి ? అంటూ బట్టలు విప్పి రచ్చ చేయడం మొదలు పెట్టాడు. అది చూసిన పెళ్లి వారందరు అవాక్కయ్యారు. పెళ్లి జరగనివ్వండి.. ఆ తర్వాత మీకు కావాల్సిన బైక్ కొనిస్తాం అంటూ యువతి తల్లిదండ్రులు బతిమాలినా వినని వరుడు నాకు ఇప్పటికిప్పుడు ఆ బైక్ ఇస్తేనే తాళి కడతానంటూ మొండికేసాడు. దీంతో వధువు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల జోక్యంతో సదుమణిగిన గొడవకు వధువు పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. వరుడును పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు.. నేను ఈ పెళ్లి చేసుకోను అంటూ బాంబ్ పేల్చింది. పెళ్ళికి ముందే వీడు ఇలా ఉంటే పెళ్లి తర్వాత ఎలా ఉంటాడో అంటూ పెళ్లి దండలు విసిరిగొట్టి వెళ్ళిపోయింది. ఈ గొడవతో వివాహ ముహూర్తం కూడా దాటిపోవడంతో అందరు ఎవరింటికి వారు వెళ్లిపోయారు.