రెండు గంటల్లో పెండ్లి.. చెప్పుల కోసం వెళ్లిన వరుడు.. షాక్‌లో వధువు

by Anukaran |   ( Updated:2021-11-11 01:09:17.0  )
Bride Refusing to Marry Groom with Bad Eyesight
X

దిశ, వెబ్‌డెస్క్: మరో రెండు గంటల్లో పెండ్లి పెట్టుకుని వధువుకు ఊహించని షాకిచ్చాడు వరుడు. చెప్పులు సరిగ్గా లేవు.. కొత్తవి తెచ్చుకుంటానని చెప్పి పరారీ అయ్యాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో వెలుగుచూసింది.

శింగనమలకు చెందిన ఓ యువకుడికి కర్నూలు జిల్లాకు చెందిన యువతితో మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఎంగేజ్‌మెంట్ అనంతరం నవంబర్ 10న మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేశారు పెద్దలు. తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు పెండ్లికి ఒప్పుకున్న వరుడు.. తీరా పెండ్లి రోజు ఏం ఆలోచించాడో కానీ,.. బుధవారం ఉదయం 10 గంటలకు పెండ్లి పెట్టుకుని, 8 గంటలకే ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. చెప్పులు మార్చుకొస్తానని చెప్పి అటు నుంచి అటే పరారీ అయ్యాడు. దీంతో పెండ్లి ఆగిపోయింది.

వధువు, ఆమె కుటుంబీకుల ఆందోళన మేరకు గాలింపు చేపట్టి.. ఎట్టకేలకు వరుడిని ఇంటికి తీసుకొచ్చారు. అయినప్పటికీ ఇష్టం లేని పెండ్లి వద్దంటూ మొండి పట్టు పట్టడంతో పంచాయితీ పెద్దలు వివాహం రద్దు చేశారు. తీరా పీటల మీద పెండ్లి ఆగిపోవడంతో తమ కూతరు భవిష్యత్తు ఏంటని బాధిత తల్లిదండ్రులు తలలు పట్టుకున్నారు.

ప్రియుడికి వేరొక యువతితో పెళ్లి.. ప్రియురాలు ఆత్మహత్య.. ప్రియుడు కూడా

Advertisement

Next Story