- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లింట విషాదం.. పెళ్లైన రెండు రోజులకే వరుడు మృతి
దిశ, వెబ్ డెస్క్ : పచ్చటి తోరణాలతో కళకళాడుతున్న కల్యాణ వేదిక, ఎన్నో ఆశలతో మెరిసిపోతున్న వధువు. కూతురు, కొడుకు పెళ్లి జరగడంతో ఆనందంలో తల్లిదండ్రులు. బంధువుల నడుమ వధూవరులు ఇద్దరు ఒక్కటయ్యారు. కొత్త జీవితాన్నీ ప్రారంబించాలనుకున్నారు. కానీ అంతలోనే వారితో విధి ఆడుకుంది. పెళ్లై 24 గంటలు గడవకముందే మృత్యువు వరుడిని కబళించింది. దీంతో అప్పటివరకు ఉన్న ఆనందం ఒక్కసారిగా ఆవిరయ్యింది. పెళ్లి ఇంట విషాదం నెలకొంది. పెళ్లి బాజా, చావు డప్పుగా మారింది. ఈ విషాద ఘటన హుబ్లీ జిల్లాలో చోటుచేసుకుంది.
హుబ్లీ జిల్లాలోని కలఘటిగి తాలూకా తబకహొన్నళ్లి గ్రామానికి చెందిన పట్టణ శెట్టి శశికుమార్ కి, హావేరి జిల్లా శిగ్గాంవి తాలూకా మూకబసరికట్టికి చెందిన ఒక యువతితో శనివారం అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఎంతో ఆనందంగా వధూవరులు అత్తవారింట అడుగుపెట్టారు. ఇక అప్పటివరకు నవ్వుతూ, తుళ్ళుతూ వధువుతో మాట్లాడుతున్న వరుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతనికి చికిత్స నిమిత్తం దగరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లగా గుండెపోటు తో వరుడు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఒక్కసారిగా ఇరు కుటుంబాలలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లైన 24 గంటల్లోనే వధువు విధవరాలిగా మారడం బాధాకరమని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.