- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రేటర్ వరంగల్@జీరో కరోనా
దిశ, వరంగల్:
గ్రేటర్ వరంగల్ పరిధిలో 11లక్షల జనాభా ఉన్నప్పటికీ ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాకపోవడం హర్షణీయమని మేయర్ గుండా ప్రకాష్ రావు అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వ ఆదేశాలను తూచ తప్పకుండా పాటిస్తున్నట్టు వివరించారు.మెప్మా ద్వారా ఇంటింటి సర్వే చేసి ఆరోగ్య వివరాలు సేకరించామన్నారు. ప్రతీ వార్డుకు ఓ టీం ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మునిసిపల్ రెవెన్యూ, పోలీస్, మెడికల్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సిబ్బందిని 24 గంటలు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. నగరవాసులకు అవసరమైన నిత్యావసరాలను అధిక ధరకు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.
ప్రధాన సెంటర్లలో ఉన్న హోర్డింగ్స్, 4000 పోస్టర్లు, లక్ష కరపత్రాలు ఇంటింటికి పంపిణీ చేసి కోవిడ్ -19పై నగర ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు వివరించారు.బల్దియాలో 58డివిజన్లలో పారిశుద్ద్యం, బ్లీచింగ్, డిసిన్ఫెక్షన్ పిచికారీ పూర్తి స్థాయిలో జరిగేలా కార్పొరేటర్‌లతో పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడించారు.నగరంలో 3 అగ్నిమాపక యంత్రాలు ,165 స్ప్రే మిషిన్ల ద్వారా డిసిన్ఫెక్షన్ ప్రక్రియ చేపట్టామన్నారు.అలాగే కరోనా మహ్మరిని అరికట్టేందుకు దాతల నుంచి విరాళాలు సేకరిస్టున్నట్టు మేయర్ తెలిపారు. మెప్మా వారిచే రూ.10 వేల మాస్క్‌లు తయారు చేయిస్తున్నట్టు మేయర్ తెలిపారు.
Tags: no positive case in greter warangal, carona, lockdown, mayor