కరీంనగర్‌లో కరపత్రం కలకలం.. ఫేక్ పోస్టులు పెట్టారో జాగ్రత్త..!

by Sridhar Babu |   ( Updated:2021-08-07 07:48:45.0  )
granite
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : గ్రానైట్ ఆరోపణలకు సంబంధించి ఏదైన వార్త ప్రచురించే ముందు మా అసోసియేషన్ వివరణ తీసుకోవాలని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం చేసే తప్పుడు ప్రచారాలు నమ్మి వార్తలు రాయవద్దని విన్నవించుకుంటున్నాం. ఇక ముందు ఎవరైనా వాస్తవాలు నిర్దారించుకోకుండా గ్రానైట్ అసోసియేషన్ ప్రతిష్ట దిగజార్చే తప్పుడు వ్యాఖ్యలు, పోస్టులు, అసత్య ప్రచారాలు చేసినట్టయితే మేము తీసుకునే చట్టపరమైన చర్యలకు బాధ్యులు కాక తప్పదని ఈ ప్రకటన ద్వారా హెచ్చరిస్తున్నాం.

గ్రానైట్ ఖనిజాల వెలికితీత, కట్టింగ్ మరియు పాలిషింగ్, రవాణా విభాగాలు ఉంటాయని, వీటి నిర్వహణ కోసం యాజమాన్యాలు కూడా వేర్వేరుగా ఉంటాయని, ఈ విషయం తెలియని కొందరు వ్యక్తులు అన్ని ఒకటిగానే భావిస్తూ అసత్య ప్రచారాలకు ఒడిగడుతూ తమను అప్రతిష్ట పాలు చేస్తున్నారంటూ కరీంనగర్ జిల్లా గ్రానైట్ క్వారీ యజమానుల అసోసియేషన్ పేరిట విడుదలైన ఓ కరపత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story