రైతులకు అందుబాటులో కొనుగోలు కేంద్రాలు

by Shyam |   ( Updated:2020-04-13 01:24:13.0  )
రైతులకు అందుబాటులో కొనుగోలు కేంద్రాలు
X

దిశ, మేడ్చల్: ఈ ఏడాది పంటలు బాగా పండటంతో దిగుబడులు పెరిగాయని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ధాన్యం అమ్ముకునేందుకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. సోమవారం శామీర్ పేట, పూడూరు, మేడ్చల్‌లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో
జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు నందరెడ్డి, భాస్కర్ యాదవ్, మున్సిపల్ చైర్మన్లు రాజేశ్వరరావు, దీపికా నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: minister, malla reddy, pady buying centre, medchal distric

Advertisement

Next Story