- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నటించడమే నా జీవిత లక్ష్యం కాదు :గ్రేసీ సింగ్
దిశ, వెబ్‌డెస్క్: ‘సంతోషం, తప్పు చేసి పప్పు కూడు’ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నటి గ్రేసీ సింగ్ నటనకు పూర్తిగా దూరంగా ఉంటోంది. హిందీలో ‘లగాన్, మున్నాభాయ్ ఎంబిబిఎస్’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్‌లో నటించిన ఆమె.. సినీ పరిశ్రమలో ఎదగాలని అనుకోలేదా? అనే ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. దాదాపు ఎనిమిదేళ్లు సినిమాల్లో పనిచేశానని.. నాకు అలాంటి ఆశయాలేవీ లేవని తెలిపింది. మనకు ఒక పనిపై కొన్ని అంచనాలు ఉన్నప్పుడు మాత్రమే అలాంటి సమస్య తలెత్తుతుందని చెప్పింది. తానెప్పుడూ ప్రాక్టికల్‌గా ఉంటానని.. ప్రజెంట్‌లోనే జీవిస్తానని తెలిపింది.
పనికోసం మేకర్స్‌ను ఎప్పుడూ కూడా సంప్రదించలేదన్న గ్రేసీ సింగ్.. తన మేనేజర్ జోషి జీ ఉన్నప్పుడు ప్రాజెక్టుల కోసం ప్రయత్నించేవాడని తెలిపింది. ఫిల్మ్ కెరియర్ స్టార్ట్ చేసినప్పడే ఎక్కువ సినిమాలు చేయనని.. చేసే సినిమాలు కూడా కుటుంబంతో చూడగలిగేవి, సాధారణ అమ్మాయి మాదిరి పాత్రలు అయి ఉండాలని మేనేజర్‌కు చెప్పానని వెల్లడించింది. 2008లో ఆయన చనిపోయారని.. ఆ తర్వాత తను ఎవరిని కాంటాక్ట్ చేయలేదని చెప్పింది. తనకు ఇండస్ట్రీలో ఎక్కువ పరిచయాలు కూడా లేవంది. మేనేజర్ ఉన్నప్పుడు కూడా సినిమాలు చాలు.. సంతృప్తిని కలిగించే వేరే పని ఏదైనా చేయాలనుకుంటున్నానని చెప్పేదాన్నని తెలిపింది. ఎందుకంటే నటించడం ఒక్కటే తన జీవిత లక్ష్యం కాదంది గ్రేసీ సింగ్.