- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
"ఆకాశం నీ హద్దురా" టీంకు ఏర్ డెక్కన్ అధినేత ఖుదోస్..
దిశ, వెబ్ డెస్క్: ఆకాశం నీ హద్దురా చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. సామాన్యుడికి విమాన ప్రయాణం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్ డెక్కన్ వ్యవస్థాపకులు కెప్టెన్ జి.ఆర్.గోపీనాథ్ పడిన కష్టం, పట్టుదల, ఆత్మ విశ్వాసాన్ని తెరపై ఆవిష్కరించిన చిత్రం ఇన్‌స్పైరింగ్‌గా ఉండగా..బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాపై స్పందించారు గోపీనాథ్.
And kudos and big salute to Director Sudha , to have balanced very deftly a male centric story lead by Suriya by portraying a wife acted by Aparna who was a powerful counter balance in an inspiring and heartwarming way
— Capt GR Gopinath (@CaptGopinath) November 13, 2020
సుధా కొంగర దర్శకత్వంలో సూర్య కథానాయకుడిగా వచ్చిన సినిమా తనకు నవ్వును, బాధను కలిగించలేదు అని.. గత జ్ఞాపకాలు గుర్తుచేసింది అని తెలిపారు. రోలర్ కోస్టర్‌గా వచ్చిన సినిమా తన ఆటోబయోగ్రఫీలోని సారాన్ని గ్రహించడంలో సక్సెస్ అయిందన్నారు. కొంచెం నాటకీయంగా ఉన్నా వెనుకబడిన గ్రామీణ నేపథ్యం ఉన్న పారిశ్రామికవేత్త కష్టాలు, పోరాటాలు చూపించిందని తెలిపారు. తన భార్య భార్గవి పాత్రను హీరోయిన్ అపర్ణా బాలమురళి చాలా బాగా చేసిందని కితాబిచ్చారు. సొంత వ్యక్తిత్వం కలిగిన ఈ పాత్ర గ్రామీణ మహిళలకు స్ఫూర్తిని ఇస్తుందన్నారు కెప్టెన్ గోపీనాథ్. మహిళలు పురుషులతో సమానం అని, సొంతంగా వ్యాపారం కూడా చేయొచ్చని చుపించడంపై అభినందలు అందించారు. సూర్య శక్తిమంతమైన పాత్రలో వ్యాపారవేత్తగా ఓ మ్యాడ్‌నెస్ యాడ్ చేసి క్యారెక్టర్‌ను ఓ లెవల్ కు తీసుకుపోయారు అని చెప్పాడు. చీకటిగా ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో ఉత్సాహ భరితమైన కథను అందించారని చెప్పాడు. మేల్ సెంట్రిక్ స్టోరీలో సూర్యను పవర్‌ఫుల్‌గా చూపిస్తూ.. ఇందుకు కౌంటర్‌గా అపర్ణను పవర్ ఫుల్ లేడిగా చూపించిన డైరెక్టర్ సుధా కొంగరకు ఖుదోస్ చెప్పారు.