- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, ఏపీ బ్యూరో: పారిశ్రామిక దిగ్గజం అదానీ సోదరులు ఆదివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారంటూ వస్తున్న వార్తలపై ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి స్పందించారు. గౌతం అదానీ సోదరులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ అయినట్లు తనకు సమాచారం లేదన్నారు. ఆ విషయం తనకు తెలియదని చెప్పుకొచ్చారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన స్కిల్ డెవలప్‌మెంట్‌లో పాల్గొన్న మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆదానీ గ్రూప్స్ నుంచి ఎలాంటి పెండింగ్ ప్రపోజల్స్ లేవని చెప్పుకొచ్చారు. అదానీ గ్రూప్స్‌తో గతంలో చేసుకున్న ఒప్పందాలే తప్ప కొత్తగా ఒప్పందాలు ఏమీ లేవని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే తాడేపల్లిలోని సీఎం నివాసంలో అదానీ బ్రదర్స్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించలేదు.