రాజస్తాన్‌లో కొవిడ్ ఇంజెక్షన్, ప్లాస్మా థెరపీ ఫ్రీ

by Shamantha N |
రాజస్తాన్‌లో కొవిడ్ ఇంజెక్షన్, ప్లాస్మా థెరపీ ఫ్రీ
X

జైపూర్: రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కరోనాతో తీవ్రంగా బాధపడుతున్న పేషెంట్లందరికీ ఇంజెక్షన్ టొసిలిజుమాబ్, ప్లాస్మా థెరపీ చికిత్సను అందుబాటులో ఉంచుతామని, వాటి ఖర్చునూ భరిస్తామని ప్రకటించారు. ఆదివారం ఆయన కరోనా పరిస్థితులను సమీక్షిస్తూ సుమారు రూ. 40వేలు ఉండే ఇంజెక్షన్‌ను పొందడం పేదలకు కష్టసాధ్యమని, కాబట్టి అవసరమైన కరోనా పేషెంట్లందరికీ ఈ ఇంజెక్షన్ అందుబాటులో ఉంచాలని రాష్ట్ర వైద్యారోగ్యాధికారులను ఆదేశించారు.

అందుకు సరిపడా నిధులను సర్కారు త్వరలోనే మంజూరు చేస్తుందని హామీనిచ్చారు. అలాగే, ప్లాస్మా థెరపీనీ అందరికి అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అందుకోసం ప్లాస్మా సేకరణపై అవగాహన, డొనేషన్ క్యాంపెయిన్‌లు చేపట్టాలని, కరోనా నుంచి కోలుకున్నవారిని ప్రోత్సహించాలని సూచించారు. జైపూర్, జోద్‌పూర్, కోటలలో ప్లాస్మా థెరపీని ప్రారంభించినట్టు అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed