నిఖార్సయిన వార్తలకు 'దిశ' దిక్సూచి: గంప గోవర్ధన్

by Shyam |
నిఖార్సయిన వార్తలకు దిశ దిక్సూచి: గంప గోవర్ధన్
X

దిశ, కామారెడ్డి: నిఖార్సయిన వార్తలకు దిశ పత్రిక ఒక దిక్సూచి కావాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కలెక్టరేట్ వద్ద ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌తో కలిసి దిశ 2021 క్యాలెండర్‌ను మంగ వారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత తరుణంలో సమాజానికి వార్తలను అందజేసే ప్రక్రియలో పత్రికలు తమ బాధ్యతను నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నాయని తెలిపారు. దిశ పత్రికలో వస్తున్న వార్తలు అక్షర సత్యాలుగా నిలుస్తున్నాయని తెలిపారు. ఈ పత్రిక మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దఫెడర్ శోభ, జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి, అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దొత్రే, టీఆర్ఎస్ రాష్ట్ర మైనారిటీ విభాగం అధ్యక్షులు ముజీబోద్దీన్, కామారెడ్డి దిశ రిపోర్టర్ వడ్ల సురేశ్ పాల్గొన్నారు

Advertisement

Next Story