- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర బడ్జెట్-2021లో ప్రతిపాదించిన పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ యాజమాన్యంలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్)లో వాటాలను విక్రయించాలని భావిస్తోంది. దీంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలైన మెకాన్, ఆండ్రూ యూల్ అండ్ కో లిమిటెడ్‌ల వాటాలను తదుపరి దశలో విక్రయించనున్నట్టు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 1న తన బడ్జెట్ ప్రసంగంలో వ్యూహాత్మక, ఇతర రంగల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదనను తెలిపారు. 2021-22లో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక సాధారణ బీమా కంపెనీని ప్రైవేటీకరించే ప్రణాళికలను ఆమె ప్రతిపాదించారు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఎయిర్ ఇండియా, బీపీసీఎల్, కాంకోర్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థలు ప్రైవేటీకరణ జాబితాలో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో భెల్‌లో ప్రతిపాదిన వాటా అమ్మకాలకు సలహాదారుగా ఉన్న ఎస్‌బీఐ కేపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ నుంచి ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం(దీపమ్) పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదనను అందుకుంది. ఏదేమైనప్పటికీ, భెల్‌లో వాటా అమ్మకం, విక్రయించబడే వాటా మొత్తంపై దీపమ్ ఇంకా తుది నిర్ణయాన్ని వెలువరించలేదు. దీంతో పాటు స్టీల్ తయారీ సంస్థ మెకాన్, తయారీ, పారిశ్రామిక సంస్థ ఆండ్రూ యులేలో ప్రతిపాదిన వాటా అమ్మకాలపై ఎస్‌బీఐ కేపిటల్ దీపమ్‌కు సూచనలందిస్తోంది. కాగా, 2021-22లో ప్రభుత్వ సంస్థల్లో వాటాల అమ్మకం ద్వారా ప్రభుత్వం రూ. 1.75 లక్షల కోట్లను సేకరించాలనే లక్ష్యంతో ఉన్న సంగతి తెలిసిందే.