- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరలో ఆదాయ పన్ను పరిధిలోకి క్రిప్టోకరెన్సీ!
దిశ, వెబ్‌డెస్క్: క్రిప్టోకరెన్సీని పన్ను పరిధిలోకి తీసుకొచ్చేందుకు ఆదాయ పన్ను చట్టాల్లో మార్పులు చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సమావేశాల్లో ఈ మార్పులు చేసే అవకాశం ఉన్నట్టు రెవెన్యూ సెక్రటరీ తరుణ్ బజాజ్ అన్నారు. ఇప్పటికే కొందరు క్రిప్టోకరెన్సీలో మూలధన లాభాలపై పన్నులు కడుతున్నారని, ఇతర సేవలను ఉపయోగిస్తున్నట్టే, ఇక్కడ కూడా జీఎస్టీ ఉంటుందని చట్టంలో ఉన్నట్టు తరుణ్ బజాజ్ తెలిపారు. ‘క్రిప్టోకరెన్సీపై పన్ను నిర్ణయం తీసుకోనున్నాం. గత కొంతకాలంగా క్రిప్టోకరెన్సీ భారీగా పెరిగింది.
చట్టాల్లో మార్పుల గురించి చర్చ జరుగుతోంది. బడ్జెట్ సమావేశాల నాటికి నిర్ణయం తీసుకుంటాం’ అని ఆయన వివరించారు. క్రిప్టో ట్రేడింగ్‌కు సంబంధించి మూలం వద్ద పన్ను(టీసీఎస్) గురించి ప్రస్తావిస్తూ, కొత్త చట్టాలను రూపొందించి తర్వాత ఈ అంశంపై స్పష్టత వస్తుందన్నారు. దేశంలో ప్రస్తుతం క్రిప్టోకరెన్సీపై ఎలాంటి నిషేధం విధించలేదు, అదేవిధంగా నిబంధనలు కూడా లేవు. ప్రభుత్వ వర్గాల ప్రకారం త్వరలో క్రిప్టోకరెన్సీపై కఠిన నిబంధలు అమలవుతాయని సమాచారం. మరోవైపు ఆర్‌బీఐ క్రిప్టోకరెన్సీపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. దేశ ఆర్థిక స్థిరత్వానికి ఇది ప్రమాదకరమని అంటున్నారు.