కేసీఆర్ ఆఫర్‌ను తిరస్కరించిన టీచర్..

by Sridhar Babu |
కేసీఆర్ ఆఫర్‌ను తిరస్కరించిన టీచర్..
X

దిశ, జగిత్యాల : అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన బంపర్ ఆఫర్‌ను ఓ టీచర్ నిర్మోహమాటంగా తిరస్కరించాడు. పదవి విరమణ సర్వీసు పొడగింపు తనకు అవసరం లేదని కుండబద్దలు కొట్టాడు. వివరాల్లోకివెళితే.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలికొండ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు (ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్)గా పని చేస్తున్న ఏనుగు మల్లారెడ్డి తనకు రిటైర్మెంట్ వయస్సు 61ఏళ్లు అవసరం లేదన్నారు. నిధులు, నియామకాలు, స్వయంపాలన కోసం రెండు దశబ్దాలుగా సాగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, నిరుద్యోగులు క్రియాశీలకంగా వ్యవహరించడం వల్లే ప్రత్యేక తెలంగాణ సిద్దించిందని గుర్తుచేశారు.

అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి ఎన్నో అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు . ముఖ్యంగా సోమవారం ఉద్యోగస్తులకు 61సంవత్సరాల పదవీ విరమణ వయస్సు పెంచుతూ తీసుకున్న నిర్ణయం వలన నిరుద్యోగులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. అందుకే దీనిని తాను వ్యతిరేకిస్తున్నానని, రిటైర్మెంట్ 61 ఏళ్ల వరకు వద్దన్నారు. వెంటనే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.దీనిపై ముఖ్యమంత్రి పునరాలోచన చేయాలని, నిరుద్యోగ యువతకు తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఏనుగు మల్లారెడ్డి కోరారు.

Advertisement

Next Story

Most Viewed