కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకోవాలి

by Shyam |   ( Updated:2020-10-06 10:00:39.0  )
కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకోవాలి
X

దిశ, ముషీరాబాద్: ఫకీర్ల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆల్ తెలంగాణ రాష్ట్ర ఫకీర్ బీసీ(ఇ) సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ హుస్సేన్ డిమాండ్ చేశారు. ఆ సంఘం రాష్ట్ర స్థాయి సమావేశానికి మంగళవారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 3లక్షల మంది ఫకీర్లు ఉన్నారని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలను పోషించడం వారికి భారంగా మారిందన్నారు. సమాజంలో తాము కూడా గౌరవంగా జీవించడానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వం తమను ఆదుకోవాలన్నారు. తాము ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం చేయూతనివ్వాలని కోరారు.

Advertisement

Next Story