- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీమా కంపెనీల విలీన ప్రక్రియ వాయిదా
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 నేపథ్యంలో ప్రభుత్వ రంగ బీమా కంపెనీల విలీన ప్రక్రియను కేంద్రం ఉపసంహరించింది. అలాగే, ప్రభుత్వ లాభదాయక వృద్ధి, నిధుల కేటాయింపు ద్వారా బీమా కంపెనీల ఆర్థిక బలోపేతానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఇదివరకు ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలను విలీనం చేయాలని ఇది వరకు తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసింది. ఈ నిర్ణయంతో బీమా సంస్థలకు రూ. 12,450 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించనుంది. ఈ మొత్తంలో ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇన్సూరెన్స్ సంస్థలకు రూ. 5 వేల కోట్ల చొప్పున, నేషనల్ ఇన్సూరెన్స్ సంస్థకు రూ. 7,500 కోట్లను కేటాయించనుంది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటం, పలు టెక్నాలజీ వేదికలు ఇతర కారణాలతో ఇప్పుడు విలీనం అతిపెద్ద సవాలుగా మారుతుందని అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వాయిదా వేసిందని అధికారులు వివరించారు.