కరోనా సమాచారం కోసం ట్విట్టర్ ఖాతా ప్రారంభించిన ప్రభుత్వం

by Shyam |
కరోనా సమాచారం కోసం ట్విట్టర్ ఖాతా ప్రారంభించిన ప్రభుత్వం
X

దిశ వెబ్ డెస్క్ :
భారత్ లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. అంతకన్నా వేగంగా కరోనా పై ఫేక్ న్యూస్ వ్యాప్తి చెందుతూ.. ప్రజల్లో భయాందోళన సృష్టిస్తున్నాయి. వదంతులు వ్యాప్తి చేయకూడదని ప్రభుత్వం ఎంత మొత్తుకుంటున్నా, పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని ఎంతగా హెచ్చరిస్తున్నా… పుకార్లు ఆగడం లేదు. దాంతో కరోనా వైరస్ పై నెట్టింట్లో వస్తున్న సమాచారంలో వాస్తవాలేమిటో, అసత్య లేమిటో తెలుసుకోలేక సాధారణ ప్రజలు ఆందోళన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ పై వాస్తవపూరితమైన సమాచారాన్ని అందించేందుకు భారత ప్రభుత్వం ఇండియా ఫైట్స్ కరోనా పేరుతో ట్విట్టర్ ఖాతాను తెరిచింది.

కరోనాపై వదంతులు ప్రచారం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఓ ట్విట్టర్ అకౌంట్ ప్రారంభించింది. ‘హ్యాష్ ట్యాగ్.. ఇండియా ఫైట్స్ కరోనా’ అనే పేరుతో ఉన్న ఈ ఖాతా ద్వారా సమాచారమందిస్తామని తెలిపింది. కరోనాపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుపుతామని తన తొలి ట్వీట్ ద్వారా చెప్పింది. @CovidnewsbyMB‌ పేరుతో దీని వివరాలు అందనున్నాయి. అంతేగాక 24 గంటలు పని చేసే హెల్ప్ లైన్ నంబర్ కూడా ఇచ్చింది. దేశవ్యాప్తంగా 1074 టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చారు. ‘‘సరైనా సమాచారాన్ని పొందడం చాలా ముఖ్యం కోవిడ్ 19 ను గురించి అధికారిక, తాజా సమాచారం కోసం @CovidnewsbyMB అకౌంట్ ను అనుసరించండి’’ అని ప్రభుత్వ సమాచార శాఖ ప్రకటించింది.


Tags: @CovidnewsbyMB, twitter, govt, corona, lockdown, india, fight, helpline

Advertisement

Next Story

Most Viewed