వచ్చే ఏడాది మార్చి నాటికి బీపీసీఎల్ ప్రైవేటీకరణ పూర్తి: సంస్థ చైర్మన్!

by Harish |
BPCL
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను 2022, మార్చి నాటికి పూర్తి చేయనున్నట్టు సంస్థ ఛైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ అన్నారు. సోమవారం జరిగిన సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశం గురించి మాట్లాడిన ఆయన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లావాదేవీలను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, సాధ్యమైనంత వరకు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తవుతుందని ఆయన తెలిపారు.

అయితే, గత కొన్నాళ్లుగా బీపీసీఎల్ ప్రైవేటీకరణకు బిడ్డర్లు ఆసక్తిగా ఉన్నారని, అయితే, బిడ్డర్ల కన్సార్టియంపై అనిశ్చితి, ఈ ప్రక్రియలో సంక్లిష్టత, వాల్యూయేషన్ తదితర అంశాల వల్ల జాప్యం జరుగుతోందని అరుణ్ కుమార్ వివరించారు. కాగా, బీపీసీఎల్‌ను ప్రైవేటీకరించడంలో భాగంగా కంపెనీలో తనకున్న మొత్తం 52.98 శాతం వాటాలను కేంద్రం విక్రయిస్తోంది. ఈ వాటా కొనుగోలుకు వేదంతా రిసోర్సెస్, అపోలో గ్లోబల్, ఐస్క్వేర్డ్‌ కేపిటల్‌లు ఆసక్తి కనబర్చాయి.

Advertisement

Next Story

Most Viewed