- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కడ నెగెటివ్.. ఇక్కడ పాజిటివ్ @1.5లక్షల బిల్లు..!
దిశ, సూర్యాపేట :
కరోనా వైరస్ యావత్ ప్రపంచం కరోనా పేరు చెబితేనే బెంబెలెత్తిపోతుంది. కరోనా సోకితే చికిత్స కోసం ప్రభుత్వ అస్పత్రిలో చేరాలంటే జంకుతున్నారు. దీంతో గత్యంతరం లేక ప్రైవేటు అస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. దీన్నే ఆసరాగా తీసుకుని వాళ్ల భయాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి ప్రైవేటు యాజమాన్యాలు. కరోనా కి చికిత్స నిర్వహిస్తామంటూ లక్షలు డిమాండ్ చేస్తూ వైద్యం చేస్తున్నారు. కరోనా లక్షణాలు ఉన్నాయంటూ యాంటిజెన్ టెస్టులు చేస్తూ కరో నా టెస్ట్‌లుగా చిత్రీకరిస్తూ అమాయకులను మాయ చేస్తున్నారు. కొంతమంది రోగులు ప్రైవే ట్ ఆసుపత్రి నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద కరోనా టెస్టులు నిర్వహించగా నెగిటివ్ రావడం తో రోగి బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఆలస్యంగా వెలుగులోకి..
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఇలాంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఆలస్యంగా వెలుగులోకి ఒక సంఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మునగాల మండలంలో గ్రామానికి చెందిన వ్యక్తి అకస్మాత్తుగా కరోనా లక్షణాలతో ఇబ్బంది పడుతుండగా కోదాడ పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్సకోసం చేరాడు. హాస్పిటల్‌కి చెందిన వైద్యుడు అతన్ని చూసి కరోనా లక్షణాలు ఉన్నాయని చూపిస్తారు. లక్ష 1.5 అవుతుందని డాక్టర్ డిమాండ్ చేసినట్లు దీనికి వైద్యుడికి రోగికి సంబంధించిన బంధువుల మధ్య జరిగిన ఒప్పందంలో 80 వేలకు కరోనా చికిత్స చేస్తామంటూ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ముందుగా 23 వేల రూపాయలు ముందుగా ఆస్పత్రిలో చెల్లించినట్లు బాధితులు తెలిపారు.
దీంతో వారి బంధువుల సలహాతో ప్రభుత్వాస్పత్రిలో కరోనా చికిత్సలు చేస్తున్నారనే సమాచారంతో నడిగూడెం మండలంలో కరోనా పరీక్ష కొరకు ప్రభుత్వ దవాఖానకు వెళ్లగా కరోనా పరీక్ష నిర్వహించగా నెగిటివ్ రావడంతో బంధు వులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రైవేట్ ఆసుపత్రులు అమాయకుల ప్రజలను మో సం చేస్తూ ప్రజల డబ్బును రక్తంలో దీనిపై జిల్లా వైద్య యంత్రాంగం పర్యవేక్షణ లేకపోవడం ఎన్నో అనుమానాలకు దారితీసింది. జిల్లాలో ఏ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా పరీక్షకు అనుమతిలేదు అని చెబుతున్నారు.
కానీ ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులు ఆసరాగా తీసుకొని డబ్బులు దండుకుంటున్నారు. ప్రస్తుతం రోజురోజుకు జిల్లాలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రైవేట్ ఆసుపత్రులు అధికారుల మధ్య బేరసారాలు ఏమైనా సాగాయని సామాజిక కార్యకర్తలు సంబంధిత అధికారులపై తీవ్ర విమర్శలు చేస్తున్నట్లు పలువు రు గుసగుసలాడుతున్నారు. ఇంత జరుగుతున్నా కానీ జిల్లా వైద్యులు చర్యలు తీసుకోకపోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం..
జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రైవేట్ ఆస్పత్రి లో కరోనా పరీక్షలు నిర్వహించినట్లు బాధితులు ఫిర్యాదు చేస్తే ఆస్పత్రి యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
– DMHO డా.హర్షవర్ధన్